కియారా అద్వానీ ఇటీవల వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాతృత్వం గురించి మాట్లాడింది.

కియారా అద్వానీ ఇటీవల వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాతృత్వం గురించి మాట్లాడింది. 2025 జులైలో కూతురు 'సరాయా'కు జన్మనిచ్చిన తర్వాత, తన శరీరం పట్ల దృక్పథం పూర్తిగా మారిపోయిందని చెప్పింది. మొదట మళ్లీ పాత షేప్‌లోకి రావాలని అనుకున్నాను. కానీ వెంటనే గుర్తొచ్చింది, పర్ఫెక్ట్ బాడీ కంటే, ఒక ప్రాణాన్ని భూమిపైకి తెచ్చిన నా శరీరం ఎంత గొప్పదో! మాతృత్వం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఇప్పుడు తన శరీరాన్ని మరింత గౌరవిస్తున్నానని అన్నారు.'వార్ 2'లో బికినీ సీన్‌ల కోసం కఠిన డైట్, వర్కౌట్ చేసినా, డెలివరీ తర్వాత శరీరం మారిపోయినా... అది సంతోషమే అని, మాతృత్వం తనను మరింత బలోపేతం చేసిందని చెప్పారు.
ప్రస్తుతం తన కూతురు సరాయాతో గడుపుతున్న ప్రతి నిమిషం తనకు ఎంతో ప్రత్యేకం అని కియారా చెప్పుకొచ్చింది. పాప చేసే చిలిపి పనులు, నవ్వులు చూస్తుంటే తన అలసట అంతా మాయం అయిపోతుందని అంటోంది. ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’, ‘వార్ 2’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కియారా, త్వరలో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కనిపించబోతోంది. మాతృత్వం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.
కియారా 2014లో ఫగ్లీతో డెబ్యూ మూవీ చేసింది. ఆ తర్వాత ఆమె కెరీర్ రాణించింది. ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సచిన్ భార్య పాత్రలో గుర్తింపు. కబీర్ సింగ్, షాహిద్ కపూర్‌తో, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. గుడ్ న్యూజ్‌లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్‌తో కలిసి నటించింది. షర్షాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో బయోపిక్ సూపర్ హిట్ సాధించింది. భూల్ భులైయా 2 లో కార్తిక్ ఆర్యన్‌తో, హారర్ కామెడీ బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. జగ్ జగ్ జీయోలో వరుణ్ ధావన్‌తో ఫ్యామిలీ డ్రామా పండించింది.


