Ritu Varma : నా కామెంట్ సెక్షన్‌లో మీ పంచాయతీ ఏమిటి? .. మండిపడ్డ రీతూవర్మ
డార్లింగ్(Darling) అన్న పదం ఇప్పుడు బాగా పాపులరయ్యింది. సోషల్ మీడియాలో అయితే ఈ పదంపై పెద్ద చర్చే జరుగుతోంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పాపులర్ చేసిన డార్లింగ్ అనే పదం చాలా మందికి ఊతపదంగా మారిపోయింది. ఈ పదంపైనే టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priya darshi), హీరోయిన్ నభా నటేశ్(Nabha Natesh) మధ్య ట్వీట్ వార్ కొనసాగిన విషయం తెలిసిందే కదా! నభా నటేశ్ పెట్టిన ఓ పోస్టుకు రిప్లై ఇస్తూ డార్లింగ్ అని సంబోధించాడు ప్రియదర్శి.
- Written By: Ehatv Published Date - Fri - 19 April 24
డార్లింగ్(Darling) అన్న పదం ఇప్పుడు బాగా పాపులరయ్యింది. సోషల్ మీడియాలో అయితే ఈ పదంపై పెద్ద చర్చే జరుగుతోంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పాపులర్ చేసిన డార్లింగ్ అనే పదం చాలా మందికి ఊతపదంగా మారిపోయింది. ఈ పదంపైనే టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priya darshi), హీరోయిన్ నభా నటేశ్(Nabha Natesh) మధ్య ట్వీట్ వార్ కొనసాగిన విషయం తెలిసిందే కదా! నభా నటేశ్ పెట్టిన ఓ పోస్టుకు రిప్లై ఇస్తూ డార్లింగ్ అని సంబోధించాడు ప్రియదర్శి. దానికి ఆమెకు కోపం వచ్చింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపుల కిందకు వస్తుందని, కేసు పెట్టవచ్చని నభా నటేశ్ పోస్ట్ చేసింది. దీనికి కూడా ప్రియదర్శి జవాబిస్తూ లైట్ తీస్కో డార్లింగ్ అని రిప్లై ఇచ్చాడు. అలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదిలాఉంటే కొద్ది రోజుల కిందట హీరోయిన్ రీతూ వర్మ(Ritu varma) ఓ ఫోటో షూట్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన ప్రియదర్శి రియాక్టయ్యారు. ‘వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో.. నీ అందానికి ముగ్ధుడనయ్యా.. మాటలు రావడం లేదు’ అని వ్యాఖ్యానించాడు. ప్రియదర్శి కామెంట్ చూసి నభా నటేశ్ మళ్లీ రియాక్టయ్యారు. ‘ఇతడు మళ్లీ మొదలు పెట్టాడు. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలవడమేమిటి’ అని అసహనం వ్యక్తం చేసింది. దీనికి ప్రియదర్శి మళ్లీ కౌంటర్ ఇచ్చాడు. తాను ఎవరినైనా డార్లిం్ అని పిలిస్తే నీకేమిటని నిలదీశారు. వీరిద్దరి మధ్య గొడవలోకి రీతూ వర్మ ఎంటర్ కావాల్సి వచ్చింది. తన కామెంట్ సెక్షన్‌లో మీ ఇద్దరి పంచాయతీ ఏమిటని ఆమె ఇద్దరిని నిలదీసింది. ప్రస్తుతం ఈ ముగ్గురి గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .
-
Killing patients with insulin: రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్.. నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
-
Revanth Reddy : ఆ కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు
-
Sridevi’s Home: అందాలతార శ్రీదేవి భవంతిలో మనం కూడా ఉండొచ్చు!
-
AP Pensions: ఏపీలో వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పింఛన్లు
-
SUN Effect: ఎండలు మరింత పెరగవచ్చు.. హెచ్చరించిన వాతావరణశాఖ
-
North Korea: ఉత్తర కొరియా కింగ్ కిమ్ జోంగ్కు ఏడాదికి 25 మంది వర్జిన్ అమ్మాయిలు కావాల్సిందే..
-
Goldy Brar : గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు…