అలా మాట్లాడకుండా ఉండాల్సింది

కల్కి 2898 ADలో(Kalki 2898 AD) ప్రభాస్(Prabhas) పాత్రపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ(Arshadwarsi) చేసిన వ్యాఖ్యలు, అతన్ని "జోకర్"(Joker) అని పిలువడంతో తెలుగు సోషల్ మీడియాలో ప్రభాస్‌కు మద్దతుగా పోస్ట్‌లు వెల్లువెత్తాయి. దీనిపై ఓ తెలుగు జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని అడగడంతో నాని(Nani) స్పందిస్తూ, “మీరు ప్రస్తావించిన వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ లేనంత ప్రచారం పొందుతున్నాడు.”

ఈ మాటలే నానిని ఇరకాటంలో పడేసింది, నార్త్ మరియు సౌత్ అభిమానులను విభజించే సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. నార్త్ ఇండియన్ అభిమానులు నానిని విమర్శించారు.

పరిస్థితిని గ్రహించిన నాని. అతను తన మాటల ఎంపిక సరిగా లేదు అని తెలుసుకొని మీడియాకు క్లారిటీ ఇచ్చాడు . పూర్తి వీడియో చూసిన తర్వాత, నాని తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడు మరియు తన అభిప్రాయం మారిందని అంగీకరించాడు. తన సరిపోద శనివారం సినిమా విడుదలకు ముందే అనవసరమైన వివాదంలో చిక్కుకున్నానని నాని గ్రహించినట్లు తెలుస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story