యూట్యూబర్(Youtuber) హర్షసాయిపై(Harsha sai) లుకౌట్ నోటీసులు(Look out notices) జారీ చేశారు పోలీసులు.

యూట్యూబర్(Youtuber) హర్షసాయిపై(Harsha sai) లుకౌట్ నోటీసులు(Look out notices) జారీ చేశారు పోలీసులు. ఓ మహిళా నిర్మాత లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ సినిమా రైట్స్ వివాదంలో భాగంగా హర్షసాయి బెదిరించి, లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. అయితే ఈ కేసు నమోదైన దగ్గరి నుంచి హర్షసాయి పరారీలోను ఉన్నాడు. తొలుత ముంబైలో ఉండొచ్చు అని అనుకున్నారు. కేసు గురించి హర్షసాయి ఒక పోస్ట్ మాత్రమే చేశాడు. హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ అతని ఆచూకీ లభించడం లేదు. హర్షసాయి కోసం పోలీసులు ఎంత గాలించినా దొరకకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story