సౌత్‌ ఇండియా లేడి సూపర్‌స్టార్‌(Lady super star) నయనతార(Nayanthara) అగ్ర కథానాయిక అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సౌత్‌ ఇండియా లేడి సూపర్‌స్టార్‌(Lady super star) నయనతార(Nayanthara) అగ్ర కథానాయిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు పదుల వయసులోనూ యువ హీరోయిన్లకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. దక్షిణాదిలో

అగ్ర హీరోలతో సమానంగా నయన్‌ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఇక షారూక్‌(Sharukh khan) నటించిన జవాన్‌(Jawan) సినిమాతో నయనతార దేశవ్యాప్తంగా పాపురల్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు పది కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. లేటెస్ట్‌గా యాభై సెకన్ల నిడివి కలిగిన ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం నయనతార ఏకంగా అయిదు కోట్ల రూపాయలు పారితోషికం అందుకోవడం సంచలనంగా మారింది. దక్షిణాది పరిశ్రమలో ఇదొక అరుదైన రికార్డు. ఇప్పటివరకు ఏ కథానాయిక కూడా కమర్షియల్‌ యాడ్‌ కోసం అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను పొందలేదు. డీటీహెచ్‌ సంస్థ టాటా స్కై కోసం రూపొందించిన యాడ్‌లో నయనతార నటించారు. ప్రస్తుతం నయనతార టెస్ట్‌, మన్నన్‌ఘట్టి 1960, డియర్‌ స్టూడెంట్‌, తని ఒరువన్‌-2 చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story