జస్టిస్‌ హేమ కమిటీ రజనీకాంత్‌కు తెలియదట

మలయాళ సినిమా పరిశ్రమలో(Malyala Film Industry) మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ(Hema justice committee) ఓ నివేదికను ఇచ్చింది. నివేదిక వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీలో ప్రకంపనాలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా కమిటీ రిపోర్ట్‌పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మహిళలు ఇప్పుడు ధైర్యంగా తమకు జరిగిన వేధింపులు, దాడుల గురించి చెబుతున్నారు. కొంతమంది హీరోలు, దర్శకుల కురచబుద్ధిని బయటపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)కు కమిటీ గురించి తెలియదట! జస్టిస్‌ హేమ కమిటీపై స్పందించమని రజనీకాంత్‌ను మీడియా కోరినప్పుడు తనకు ఎంత మాత్రం తెలియదంటూనే సారీ అని చెబుతూ వెళ్లిపోయారు. రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం గురించి రజనీకాంత్‌ స్పందించకపోవడం ఏమిటీ అంటూ ఆయన ఫ్యాన్స్‌ కూడా మండిపడుతున్నారు. రజనీకాంత్‌ లాంటి అగ్రనటులే ఇలాంటి అంశంపై స్పందించకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. రజనీ.. మీరు గజినీలా మారకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story