టెలివిజన్ స్టార్లు సురభి చందన(Surabhi chandana)-కరణ్ శర్మలు(Karan sharma) 13 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. మార్చి నెలలో వివాహబంధంతో ఒక్కటైన వీరు ప్రస్తుతం వెకేషన్‌ను(Vacation) ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా స్విమ్మింగ్‌పూల్‌లో భర్తతో జలకాలాటలు ఆడుతున్న వీడియోను సురభి సోషల్ మీడియాలో షేర్ చేసింది

Surabhi Chandana
టెలివిజన్ స్టార్లు సురభి చందన(Surabhi chandana)-కరణ్ శర్మలు(Karan sharma) 13 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. మార్చి నెలలో వివాహబంధంతో ఒక్కటైన వీరు ప్రస్తుతం వెకేషన్‌ను(Vacation) ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా స్విమ్మింగ్‌పూల్‌లో భర్తతో జలకాలాటలు ఆడుతున్న వీడియోను సురభి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సురభిచందనను చూసి చాలా మంది క్రికెటర్ చాహల్(Chahal) భార్య ధనశ్రీగా(Dhanasri) పొరపడుతున్నారు. ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నారు. 'ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది' అని ఓ నెటిజన్ తిట్టిపోశాడు. ఈమె ధనశ్రీయేనా? నమ్మలేకపోతున్నాను. సారీ చాహల్.. నువ్వు ఆమెను భార్యగా ఎంచుకుని పొరపాటు చేశావు అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంకొకరు చాహల్‌ను ట్యాగ్ చేస్తూ అసహనం వ్యక్తం చేశాడు. 'నిన్న ట్యాగ్ చేస్తున్నందుకు సారీ.. కానీ చూస్తున్నావుగా.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా? ' అని బాధపడ్డాడు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరు అని చాలా మంది అడుగుతున్నారు. ఈ రచ్చ అంతా చూసిన తర్వాత సురభి చందన ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఆమె మీరు అనుకున్నట్టు ధనశ్రీ కాదని, సురభి చందన అని క్లారిటీ ఇస్తున్నారు. ఒకరి పోలికలతో ఉంటే ఎంత ఇబ్బందో ఇప్పుడర్థమయ్యిందా?
