కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌(Vijay thalapathy) నటించిన ది గోట్(The GOAT) సినిమా ఫ్యాన్స్‌కు మినహా ఎవరికీ పెద్దగా నచ్చలేదు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌(Vijay thalapathy) నటించిన ది గోట్(The GOAT) సినిమా ఫ్యాన్స్‌కు మినహా ఎవరికీ పెద్దగా నచ్చలేదు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వెంకట్‌ ప్రభు(Venkat prabhu) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న క్రేజ్‌ ది గోట్ సినిమాతో మట్టికొట్టుకుపోయింది. ఒక్క తమిళనాడులో తప్పితే ఎక్కడా ఆ సినిమా సరిగ్గా ఆడటం లేదు. అంత పెద్ద బోర్‌ సినిమా తీసి ఇమేజ్‌ పోగొట్టుకున్న వెంకట్‌ప్రభు ఆ తర్వాత ఇచ్చిన స్టేట్‌మెంట్లతో మరింత ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్(CSK) ను చూపించడం వల్లనే మిగతా రాష్ట్రాల ప్రజలు ది గోట్‌ను చూసేందుకు ఇష్టపడలేదని ఓసారి అన్నాడు. మరోసారి తను సమీక్షకుల కోసం సినిమా తీయలేదంటూ కాంట్రవర్సరీ వ్యాఖ్యలు చేశారు. ఈ దెబ్బతో నాలుగైదు రోజుల పాటు ట్రోలింగ్‌కు గురయ్యాడు వెంకట్‌ప్రభు. అంతా సద్దుమణిగిపోయందనుకున్న టైమ్‌కు మళ్లీ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. అందుకు కారణం అతడు 80 లక్షల రూపాయలు పెట్టి ఓ లగ్జరీ కారు(Car) కొనడమే. చెత్త సినిమా తీసి తమకు తలనొప్పులు తెచ్చిపెట్టి నువ్వేమో లగ్జరీ కారు కొనుక్కుంటావా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. సినిమాలో దళపతి విజయ్‌ ఉన్నాడు కాబట్టి కనీసం తమిళనాడులో అయినా ఆడింది. లేకపోతే ఢమాల్‌ అనేది అంటూ కోపగిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story