కల్యాణ్‌రాం(Kalyan Ram) ప్రతిష్టాత్మక నిర్మించి, జూ.ఎన్టీఆర్‌(Jr NTR) నటించిన 'దేవర'(Devara) సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కల్యాణ్‌రాం(Kalyan Ram) ప్రతిష్టాత్మక నిర్మించి, జూ.ఎన్టీఆర్‌(Jr NTR) నటించిన 'దేవర'(Devara) సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనెల 27న దేవర సినిమా పాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. ఈ మధ్యనే ఈ సినిమా ట్రయల్‌ను విడుదల చేసి అంచనాలు పెంచేశారు. ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ట్రైలర్ లాంచ్ ఘనంగా చేసి, పలు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేస్తున్నారు. దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) హాజరుకానున్నారు. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఆసక్తి పెరిగింది. మరో హీరో మహేష్‌బాబు(Mahesh babu) కూడా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తారని టాక్ వినిపిస్తుంది. గతంలో మహేష్ బాబు సినిమా విడుదల సమయంలో జూ.ఎన్టీఆర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివతో ఉన్న బంధం కారణంగా అప్పుడు ఎన్టీఆర్ వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కొరటాల శివ కోరగా సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌, మహేష్‌బాబు దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు వస్తే అందరినీ కలిపి ఒకే వేదికపై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story