ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) ప్రముఖ నటుడు షాయాజీ షిండే(Shayaji shinde) భేటి అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) ప్రముఖ నటుడు షాయాజీ షిండే(Shayaji shinde) భేటి అయ్యారు. మొన్న ఓ సినిమా ఫంక్షన్‌లో ఆలయాలలో ప్రసాదంతో పాటు ఓ మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందంటూ చెప్పిన షాయాజీ షిండే తన ఆలోచనను పవన్‌తో పంచుకుంటానని అన్నారు.పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలిసి తాను చేపట్టిన వృక్ష ప్రసాద్‌ యోజన గురించి వివరిస్తానని కూడా అన్నారు. షాయాజీ అలా అన్నారో లేదో పవన్‌ ఇలా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేశారు. మంగళగిరిలోని పవన్‌ కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి పవన్‌ను షిండే కలుసుకున్నారు. ఈ భేటీ చాలా క్యాజువల్‌ అని అనుకుంటున్నారు కానీ కలయిక వెనుక ఓ అంతరార్థం ఉంది. భక్తులకు ప్రసాదంతో పాటు మొక్క ఇవ్వాలనే షాయాజీ షిండే సూచనను పవన్‌ స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే పవన్‌ కల్యాణ్‌తో ఓ ముఖ్యమైన పని కోసమే షాయాజీ భేటి అయ్యారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) కొన్ని రోజులుగా పవన్‌ వెంట పడుతున్నారు. రోజుకో ట్వీట్‌తో పవన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కౌంటర్‌ ఇచ్చుకోలేని ప్రశ్నలను సంధిస్తున్నాడు. జస్ట్ ఆస్కింగ్‌ అంటూనే సెటైర్లు విసురుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం సమయంలో ప్రకాశ్‌ ఓ ట్వీట్‌ను విసిరారు. దానికి పవన్‌ ఆవేశంతో ఊగిపోయారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దానికి ప్రకాశ్‌రాజ్‌ చాలా కూల్‌గా... పాపం పవన్‌కు తన ట్వీట్‌ అర్థం కానట్టుగా ఉంది.. ఓసారి నింపాదిగా చదువుకో పవన్‌ అంటూ సలహా ఇచ్చారు. అది పవన్‌ను ఇంకా మండించింది. అక్కడ్నుంచి ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ల మీద ట్వీట్లు వదులుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌తో పవన్ మూడు నాలుగు సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి కూడా ! ప్రకాశ్‌ రాజ్‌ నటనకు తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన విలక్షణమైన నటుడు. పాత్రలో ఇట్టే ఒదిగిపోతారు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌కు అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌కు మునుపటిలా అవకాశాలు వస్తాయా అన్న సందేహం చాలా మందికి వచ్చింది. పవన్‌ నటిస్తున్న ఓజీలో కూడా ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ఆయనను కంటిన్యూ చేస్తారా లేక తప్పించి మరో నటుడిని తీసుకుంటారా అన్నది తెలియాల్సి వుంది. ఈ క్రమంలోనే ప్రకాశ్‌రాజ్‌ను షాయాజీ షిండేతో రీప్లేస్‌ చేయాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారనే టాక్‌ నడుస్తోంది. ఇదొక్క సినిమాలోనే కాదు, మిగతా సినిమాల్లోంచి కూడా ప్రకాశ్‌రాజ్‌ను తప్పించే ప్రయత్నాలు జరగుతున్నాయట! షాయాజీ షిండే కూడా గొప్ప నటుడే. కాకపోతే ప్రకాశ్‌రాజ్‌కు సూటయ్యే పాత్రలు షాయాజీ షిండేకు నప్పవు. ఇద్దరి నటనా శైలులు భిన్నమైనవి! ప్రకాశ్‌రాజ్‌పై ఇంతకు ముందు తెలుగు ఇండస్ట్రీ కొన్నాళ్లపాటు బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో ప్రకాశ్‌రాజ్‌పై అనధికార నిషేధాన్ని విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story