పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Power star pawan kalyan) పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Power star pawan kalyan) పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం(Deputy CM) పదవిని చేపట్టిన తర్వాత క్షణం తీరిక ఉండటం లేదు. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే పెండింగ్‌లో ఉన్న సినిమాలను కంప్లీట్‌ చేయాలని అనుకుంటున్నారు. హరిహర వీరమల్లు(Hari hara veera mallu) మొదటి భాగం మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయడానికి సమయం కేటాయించారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నారు.

'బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, అయిదు అవార్డులను గెలుచుకున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story