✕
Pooja Hegde : అవకాశాల కోసం అందాలను ఎరవేస్తున్న పూజా హెగ్డే!
By EhatvPublished on 17 Sep 2023 1:48 AM GMT
కలిమి నిలవదు లేమి మిగలదు. కలకాలం ఒక రీతి గడవదు అన్నారో సినీ కవి. నిజమే, పరిస్థితులు ఎల్లకాలం ఒక్కలా ఉండవు.అగ్రస్థానంలో ఉన్న ఆర్టిస్టులు కూడా కాలం కలిసి రాకపోతే చాన్సులు లేక అవస్థలు పడాల్సి వస్తుంది.

x
Pooja Hegde
-
- కలిమి నిలవదు లేమి మిగలదు. కలకాలం ఒక రీతి గడవదు అన్నారో సినీ కవి. నిజమే, పరిస్థితులు ఎల్లకాలం ఒక్కలా ఉండవు.అగ్రస్థానంలో ఉన్న ఆర్టిస్టులు కూడా కాలం కలిసి రాకపోతే చాన్సులు లేక అవస్థలు పడాల్సి వస్తుంది. నటి పూజా హెగ్డే పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. బహుశా తనకు ఈ పరిస్థితి వస్తుందని ఆమె ఊహించి ఉండదు.
-
- 33 ఏళ్ల ఈ అందాల భామ ముగమూడి అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ చిత్రం ఆశించినమేర విజయం సాధించలేదు. అందుకే అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో టాలీవుడ్ పూజా హెగ్డేను ఆదుకుంది. మొదట్లో ఒకట్రెండు చిత్రాలు ఓ మోస్తారుగా ఆడినప్పటికీ తర్వాతర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లయ్యాయి.
-
- దాంతో వరుస అవకాశాలు రావడం మొదలయ్యింది. పూజా హెగ్డే అగ్రనటిగా ఎదిగింది. అల్లు అర్జున్ సరసన నటించిన అల వైకుంఠపురం సినిమా ఘన విజయం సాధించడంతో స్టార్ హీరోలంతా పూజా హెగ్డేతో కలిసి నటించాలని అనుకున్నారు. అలా ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్‌లో, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించారు పూజా.
-
- తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పట్నుంచి పూజా హెగ్డేకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గుంటూరుకారం సినిమాలో మహేశ్‌బాబుతో హీరోయిన్గా నటించడానికి అంగీకరించిన పూజా తర్వాత ఏమైందో కానీ అందులోంచి తప్పుకున్నారు.
-
- ఓ మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. ఆ విధంగా పూజా హెగ్డే సినిమాల ఖాతా ఖాళీ అయ్యింది. దీంతో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి ఆమె తన అందాలను ఎరవేస్తున్నారు.
-
- రకరకాల ఫొటో సెషన్లు చేయించుకుంటూ ఆ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. అలాంటి ఫోటోలకు కుర్రకారు నుంచి స్పందన వస్తున్నా చిత్ర వర్గాల నుంచి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు పూజా హెగ్డేను ఎవరు ఆదుకుంటారో చూడాలి.

Ehatv
Next Story