నటి పూనమ్‌ కౌర్‌(Poonam kaur) ట్వీట్లన్ని పరోక్షంగా దర్శక, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను(Trivikram srinivas) టార్గెట్ చేస్తూ ఉంటాయి.

నటి పూనమ్‌ కౌర్‌(Poonam kaur) ట్వీట్లన్ని పరోక్షంగా దర్శక, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను(Trivikram srinivas) టార్గెట్ చేస్తూ ఉంటాయి. తాజాగా పూనమ్‌ కౌర్‌ మరో ట్వీట్ చేశారు. ఓ తెలుగు దర్శకుడు ఓ అమ్మాయిని గర్భవతిని(Pregnant) చేసి, ఆమె కెరీర్‌ను నాశనం చేశాడని ట్వీట్‌లో తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 'ఓ సినీ నటిని గర్భవతిని చేసి ఆమె కెరీర్‌ను నాశనం చేసింది రాజకీయ నాయకుడిగా(Politician) మారిన నటుడు కాదు. ఆ పని చేసింది ఇండస్ట్రీలోని ఓ దర్శకుడు(Director). ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) జోక్యంతో ఆ సగం పంజాబీ నటికి కొంచెం సాయం లభించింది. అయితే ఈ విషయంలో ఓ నటుడు కమ్‌ రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు' అని పూనమ్‌ కౌర్‌ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లో పూనమ్‌ కౌర్‌ ఏ ఒక్కరిని పేరుతో ప్రస్తావించలేదు. కానీ గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే ఆవేదనగా చెప్పారు. . తాజా ట్వీట్ చూస్తే ఎవరిని ఉద్దేశించి పూనమ్‌ కౌర్‌ అన్నారో ఈజీగా తెలిసిపోతున్నది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story