ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani master) వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani master) వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. లైంగిక వేధింపుల(Sexual harrasmet) ఆరోపణలపై జానీపై కేసు నమోదు చేశారు.

జానీ మాస్టర్‌పై నార్సింగ్‌ పోలీసులు ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద రేప్‌ కేసు(Rape case) నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రేష్ట వర్మ(Shrista verma) ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులో చెప్పిన అంశాలు షాకిస్తున్నాయి. 'జానీ మాస్టర్‌ దగ్గర చేరిన రోజు నుంచే నాకు వేధింపులు మొదలయ్యాయి. తరచూ తన సెక్స్‌ కోరిక తీర్చాలని వేధించేవాడు. కోరిక తీర్చుకుంటే సినిమాల్లో ఒక్క అవకాశం కూడా రానివ్వనని బెదిరించేవాడు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్‌ తీసి బలవంతం చేశాడు. నేను కాదనే సరికి నా తలను అద్దానికేసి కొట్టాడని ఆరోపించింది. జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ కూడా చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉండాలని ఆదేశించింది. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్‌పై తన ట్వీట్ల ద్వారా విరుచుకుపడే నటి పూనంకౌర్.. ఈ సారి జానీ మాస్టర్‌ను టార్గెట్ చేసింది. జానీ మాస్టర్‌ను మాస్టర్‌ అని పిలవకండన్నారు. ఇకపై 'షేక్ జానీ' అని పిలవాలన్నారు. మాస్టర్‌ అనే పదాన్ని గౌరవించాలని ట్వీట్‌ చేసి మరోసారి పూనం వార్తల్లోకి ఎక్కారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story