సినీ నటి పూనమ్‌ కౌర్‌(Poonam kaur) తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

సినీ నటి పూనమ్‌ కౌర్‌(Poonam kaur) తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) సెటైర్లు విసురుతుంటారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్‌(Trivikram) శ్రీనివాస్‌పై అయితే ఘాటు వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా ఆయనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పూనమ్‌ కౌర్‌. ఈ మ‌ధ్య తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌ణీత్ హ‌నుమంతు(Praneeth hanumanthu) చిన్న పిల్ల‌ల విష‌యంలో అమ్మాయిల విష‌యంలో సెక్స్‌వ‌ల్, వల్గర్‌ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బుధ‌వారం తెలంగాణ పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. అయితే ఈ చిన్న‌పిల్ల‌ల‌తో పాటు ఆడ‌పిల్ల‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు కొత్తేమి కాద‌ని ఇంత‌కుముందు కూడా తెలుగు హీరోలు కూడా ఇలాంటి చేశారంటూ సోష‌ల్ మీడియాలో పెద్దఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇందులో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌ల్సా సినిమాపై కూడా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. జల్సా సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్‌కు ఒక డైలాగు ఉంటుంది. అదేమిటంటే 'ప‌డుకోని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఆనందం ఏముంటుంది.. పరిగెత్తించి పరిగెత్తించి చేయాలి' అని అంటాడు. ఈ డైలాగుపై పూనమ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రియాక్టయ్యారు. త్రివిక్రమ్‌ నుంచి ఇంతకంటే మంచి డైలాగులు ఆశించడం తప్పే అవుతుంది అని చెప్పారు. అయితే దీనికి ఒక నెటిజ‌న్ కౌంట‌ర్ ఇచ్చాడు. ' త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో చెప్ప‌కండి అంద‌రికి తెలుసు త్రివిక్ర‌మ్ టాలెంట్ ఏంటో' అని రాసుకొచ్చాడు. దీనికి పూనమ్‌ కౌర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 'త్రివిక్రమ్‌ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్‌ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్‌ నాశనం చేస్తారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండి' అంటూ చెడామడా తిట్టిపారేశారు.

Eha Tv

Eha Tv

Next Story