పాప్‌ సింగర్‌ షకీరాకు(Shakira) అరుదైన గౌరవం దక్కింది. బెల్లి డ్యాన్స్‌తో(Belly Dance) పాపులరైన షకీరాకు అదే ఫోజులో విగ్రహం(Idol) పెట్టి సత్కరించారు.
పాప్‌సాంగ్స్‌ సింగర్‌ షకీరా విగ్రహాన్ని ఆమె సొంత ఊరిలో(Home Town) ఆవిష్కరించారు. బెల్లి డ్యాన్స్‌ ఫోజుతో ఉన్న ఈ విగ్రహం పాప్‌ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొలంబియాలోని(Columbia) తన హోంసిటీ అయిన బారంక్విలాలో ఈ విగ్రహణ కార్యక్రమం జరిగింది.

పాప్‌ సింగర్‌ షకీరాకు(Shakira) అరుదైన గౌరవం దక్కింది. బెల్లి డ్యాన్స్‌తో(Belly Dance) పాపులరైన షకీరాకు అదే ఫోజులో విగ్రహం(Idol) పెట్టి సత్కరించారు.
పాప్‌సాంగ్స్‌ సింగర్‌ షకీరా విగ్రహాన్ని ఆమె సొంత ఊరిలో(Home Town) ఆవిష్కరించారు. బెల్లి డ్యాన్స్‌ ఫోజుతో ఉన్న ఈ విగ్రహం పాప్‌ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొలంబియాలోని(Columbia) తన హోంసిటీ అయిన బారంక్విలాలో ఈ విగ్రహణ కార్యక్రమం జరిగింది. మగదలీనా నది పక్కనే ఉన్న పార్క్‌లో షకీరా విగ్రహాన్ని బారంక్విలా మేయర్‌ జామీ పుమెరేజో ఆవిష్కరించారు.

ఈ విగ్రహాన్ని రూపొందించిన మార్క్వేజ్‌ అనే ఆర్టిస్ట్ మాట్లాడుతూ షకీరాను ఆమె చిన్నతనం నుంచి చూస్తున్నానని.. స్థానికంగా పలు కచేరీల్లో షకీరా ఇచ్చిన ప్రదర్శనలను చూశానని మార్క్వేజ్‌ అన్నారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అమ్మాయిలు తమ కలలను నెరవేర్చుకోవచ్చు.. తమ లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశాన్ని అక్కడ ఇచ్చారు. అయితే షకీరా ప్రస్తుతం మియామీలో ఉంటోంది. తన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా స్పందిస్తూ.. తన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకెంతో గౌరవమని.. బారంక్విలా ఎల్లప్పుడూ తన సొంత సిటీయేనని ఆమె ఓ ప్రకటనలో తెలిపింది.

Updated On 28 Dec 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story