ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అమరావతిలో దిల్‌రాజు సమావేశం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అమరావతిలో దిల్‌రాజు సమావేశం అయ్యారు. గేమ్‌ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రావాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్‌ను దిల్‌రాజ్‌ ఆహ్వానించారు. సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. విజయవాడలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా 2025 జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు దిల్‍రాజు ఇప్పటికే ప్రకటించారు. కటౌట్ లాంచ్ ఈవెంట్‍లో ఫ్యాన్స్ ట్రైలర్.. ట్రైలర్ అంటూ అప్‍డేట్ కోసం అరిచారు. దీంతో దిల్‍రాజు స్పందించారు. కొత్త సంవత్సరం జనవరి 1న ట్రైలర్ తెస్తామని అన్నారు. ఇప్పటికే ట్రైలర్ తన ఫోన్‌లోనే ఉందని.. అది మీ దాక వచ్చేవరకు చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. జనవరి 1న ట్రైలర్‌ చూస్తారన్నారు. దీంతో రాంచరణ్‌, మెగా ఫ్యాన్స్‌ అంతా ట్రైలర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story