సినీ నటుడు రాజ్‌తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya choudhary) ఎపిసోడ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక వార్త తెలుస్తోంది.

సినీ నటుడు రాజ్‌తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya choudhary) ఎపిసోడ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక వార్త తెలుస్తోంది. తనతో పదేళ్లకు పైగా సహజీవనం చేసిన రాజ్‌తరుణ్‌ ఇప్పుడు తనను కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లావణ్య చౌదరి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే! అప్పట్నుంచి రాజ్‌తరుణ్‌, లావణ్యలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ రోజు పోలీసులు రాజ్‌తరుణ్‌పై కూడా కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌, మాల్వీలపై(Malvi malhotra) లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ముఖ్య ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. రాజ్‌తరుణ్‌-లావణ్యలు కలిసి ఉన్న ఫోటోలు ఓ 170 వరకు ఉన్నాయట! వీటితో పాటు టెక్నికల్‌, మెడికల్‌ ఎవిడెన్స్‌లు చాలానే అందచేసిందట! ఇవన్నీ చూసిన తర్వాతే పోలీసులు రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టారు. రాజ్‌తరుణ్‌తో తనకు పదేళ్ల కిందటే పెళ్లయ్యిందని, పదేళ్లపాటు కలిసి కాపురం చేశామని లావణ్య చెబుతోంది. కొన్నాళ్ల కిందట గర్భం(Pregnant) దాలిస్తే బలవంతంగా అబార్షన్‌(abortion) చేయించాడని లావణ్య ఆరోపించింది. ఇందుకు సంబంధించిన మెడికల్‌ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందించింది. చాలా కాలంలో అన్విక పేరుతో ఉన్నానని, అదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లానని లావణ్య తెలిపారు. ఎప్పుడైతే రాజ్‌తరుణ్‌ జీవితంలోకి మాల్వీ మల్హోత్రా ప్రవేశించిందో అప్పట్నుంచి తనను అతడు దూరం పెట్టాడని లావణ్య తెలిపింది. మాల్వీ కోసమే రాజ్‌తరుణ్‌ ముంబాయికి వెళుతుంటాడని, అక్కడే ఎక్కువ రోజులు ఉంటున్నాడ‌ని లావణ్య వివరించిది. అత‌ను ఎప్పుడెప్పుడు ముంబాయికి వెళ్లింది, ఎవ‌రింటికి వెళ్లింది, ఎన్ని రోజులు ఉన్నాడు అనే విష‌యాలకు సంబంధించి తన దగ్గర అధారాలు ఉన్నాయని లావణ్య తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story