రాజాసాబ్‌.. ఫుల్ టైమ్ పాస్, ఫన్ ఎంటర్‌టైనర్..!

ది రాజాసాబ్ (The Raja Saab) జనవరి 9, 2026 రిలీజ్ అయింది. రాజాసాబ్ అనేది ప్రభాస్ కెరీర్‌లో కొత్తగా ప్రయత్నించిన హారర్, కామెడీ, రొమాన్స్ మిక్స్ సినిమా. ప్రభాస్‌ను ఇంత లైట్, ఫన్ మోడ్‌లో చూడటం ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి. ఒర పెద్ద పాత రాజభవనం, అందులో దాగి ఉన్న రహస్యాలు, ఆ భవనంతో ప్రభాస్ పాత్రకు ఉన్న అనుబంధం, ఈ నేపథ్యంతో కథ సాగుతుంది. హారర్ ఎలిమెంట్స్ ఉన్నా భయపెట్టేలా కాక ఫన్‌గా ఉంటాయి. కథ సీరియస్ కాకుండా ఎంటర్టైనింగ్ టోన్‌లో నడుస్తుంది. లాజిక్ కంటే ఎంటర్టైన్మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభాస్‌ని చాలా కాలం తర్వాత ఫుల్ ఫన్, చార్మింగ్ రోల్‌లో చూస్తాం. కామెడీ టైమింగ్ బాగుంది, డైలాగ్ డెలివరీ ఈజీగా ఉంది. ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టైల్, స్వాగ్ ఉంది

యాక్షన్ హీరో ఇమేజ్ నుంచి కొంచెం రిలీఫ్ తీసుకున్న సినిమా. హీరోయిన్ పాత్ర గ్లామర్, కామెడీకి ఉపయోగపడింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కామెడీని బాగా క్యారీ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది అన్న టాక్‌ వచ్చింది. పాటలు వినడానికి బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హారర్ సీన్స్‌కి ప్లస్, కొన్ని చోట్ల మ్యూజిక్ ఓవర్‌గా అనిపించదని టాక్. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి, సెట్ డిజైన్, రాజభవనం లుక్ బాగుంది.

CGI కొన్ని సీన్స్‌లో మెరుగ్గా ఉండాల్సింది

ప్లస్ పాయింట్స్: ప్రభాస్ లైట్ హార్ట్‌డ్ పెర్ఫార్మెన్స్, హారర్, కామెడీ మిక్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు చూసే సినిమా, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్.

మైనస్ పాయింట్స్: కథ చాలా డీప్ కాదు, సెకండ్ హాఫ్ కొంచెం స్లో, హారర్ ఎలిమెంట్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది.

ఫైనల్‌గా చెప్పాలంటే రాజాసాబ్, అటు మాస్ యాక్షన్ కాదు, ఇటు క్లాస్ సినిమా కాదు, ఫుల్ టైమ్ పాస్, ఫన్ ఎంటర్‌టైనర్ ప్రభాస్‌ని నవ్వుతూ, రిలాక్స్‌గా చూడాలంటే మాత్రం తప్పకుండా చూడొచ్చు.

Updated On
ehatv

ehatv

Next Story