త్రినాధరావు గరగ, సీనియర్ జర్నలిస్ట్ స్పష్టమైన రివ్యూ..!

కల్కి అనంతరం ప్రభాస్ ఫుల్ లెంగ్త్ హీరోగా రూపొంది, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “రాజాసాబ్".. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ & ఫ్యాంటసీ ఎంటర్టైనర్ భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ప్రభాస్ ను చాన్నాళ్ల తర్వాత కామెడీ జోనర్ లో చూడనుండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.. సినిమా విషయంలో మొదటి రోజంతా బాగా ట్రోల్ అయిన దర్శకుడు మారుతి గురించి ముందుగా ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను దర్శకుడు హ్యాండిల్ చేయలేకపోయాడు. దర్శకుడు ప్రభాస్ లో ఫ్యాన్స్ & రెగ్యులర్ సినిమా ఆడియన్స్ మిస్ అవుతున్న ఫన్ యాంగిల్ ని సరికొత్తగా ఆవిష్కరిద్దామనుకున్న ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. కానీ.. హారర్ & ఫ్యాంటసీ జోనర్ లో సైకాలాజీని ఇరికించడం అనేది సరిగా వర్కవుట్ అవ్వలేదు. మైండ్ గేమ్ ఎపిసోడ్స్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. వాటిని సాగదీసిన విధానం ఆకట్టుకోలేకపోయింది.ఇక మరీ ముఖ్యంగా టీజర్ రిలీజ్ నుండి అందరూ ఎగ్జెట్ అయిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అనేది కంప్లీట్ గా సినిమా నుండి తీసేయడం అనేది పెద్ద డిజప్పాయింట్మెంట్. అలాగే.. ప్రభాస్ కోసం ఇరికించానని చెప్పిన ముగ్గురు హీరోయిన్ల ట్రాక్ అనేది వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్ పర్వాలేదనిపించుకున్నారు. ఆకట్టుకోలేకపోయారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో పాటుగా హర్రర్, ఫాంటసీ, మాస్ మరియు కామెడీ అంశాలు ఉన్నా కూడా వాటిని మిక్స్ చేసిన విధానం మాత్రం పూర్తిగా దారి తప్పేసింది.. నాకైతే దర్శకుడు మారుతి పాన్ ఇండియా సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో అనిపించింది.కేవలం హీరో కమర్షియల్ ఇమేజ్, ఎలివేషన్స్ కోసం రాసినరొటీన్ స్టోరీ తప్ప ఇంకేమీ కనిపించదు.కొన్ని సీన్స్‌లో హీరోతో చూపించిన యాక్షన్ బాగున్నా అవి స్టోరీకి అసలు సంబంధం లేకుండా కేవలం ఎలివేషన్ కోసమే పెట్టినట్టుగా అనిపిస్తాయి.ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే స్క్రీన్‌ప్లే..హైప్ ఇచ్చే సీన్స్ రాసుకోలేకపోవడం ఖచ్చితంగా దర్శకుడు మిస్టేకే. దానికి తోడు ఈ మధ్యకాలంలో సరుకు లేని సినిమాలను కూడా తన బిజిఎంతో లేపుతున్న తమన్ కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు.బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించినా పాటలు మాత్రం అసలు ఇంప్రెస్ చేయలేకపోయాయి..

ఇక నటీనటుల విషయానికొస్తే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తెరమీద చాలా అందంగా ఉన్నాడు. నవరసాలు పండించే సీన్లు పెట్టినా స్క్రీన్ ప్లే లో డెప్త్, డైలాగులలో దమ్ము లేకపోవడం వల్ల అతని కష్టం వృధా అయ్యింది. ఉండటానికి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా వీరిలో మాళవిక మోహనన్ మాత్రం బాగా మెప్పించింది. బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ది మాత్రం అరుంధతిలో సోనుసూద్ తరహా క్యారెక్టర్. అయితే సోనుసూద్ లా భయపెట్టలేకపోయాడు. ఉన్నంతలో బొమన్ ఇరానీ కాస్త పరవాలేదు అనిపించాడు. ప్రభాస్ శ్రీను సత్య వీటివి గణేషులు అక్కడక్కడ నవ్వించారు. ఇక టెక్నికల్ గా చూస్తే తమన్ నేపద్య సంగీతం చాలా చోట్ల ఎమోషన్ ఎలివేట్ చేసింది. కాకపోతే కొన్ని చోట్ల మరీ లౌడ్ అనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. రాజ్ మహల్ సెట్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దారు. కార్తీక్ పళని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. పీపుల్ మీడియా ఫాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నంతంగా వున్నాయి. మారుతి ఎంచుకున్న హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ బావుంది. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఎఫెక్టివ్ గా తీసుంటే ఎక్స్ పీరియన్స్ ఇంకా బెటర్ గా వుండేది. ఏదేమైనా పండగ ముందు గతి తప్పిన కథనం తో పాటు ఆకట్టుకోని స్క్రీన్ ప్లే తో రాజాసాబ్ రావడం అనేది ప్రభాస్ అభిమానులకు మింగుడు పడటం కష్టమే..

Updated On
ehatv

ehatv

Next Story