మెగాస్టార్‌ రామ్ చరణ్ తేజ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. లండన్‌(London)లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం( Madame Tussauds)లో ఆయన మైనపు విగ్రహాన్ని ఈనెల 9న ఏర్పాటు చేయనున్నారు.

మెగాస్టార్‌ రామ్ చరణ్ తేజ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. లండన్‌(London)లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం( Madame Tussauds)లో ఆయన మైనపు విగ్రహాన్ని ఈనెల 9న ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్(Ram Charan) తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు బయలుదేరి వెళ్లారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా కొలువుదీరనుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi), సురేఖ (Surekha)రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన(Upasana) కామినేని కొణిదెల, ఆయన కూతురు క్లీంకార కొణిదెల (Klin Kaara)లండన్ వెళ్లారు. రామ్ చరణ్ 'RRR' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం తెలుగు సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ విగ్రహం ఎలా ఉండబోతుందోనని, ఆవిష్కరణ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల సరసన రామ్ చరణ్ చేరనుండటం గమనార్హం. ఈ విగ్రహాలు “IIFA జోన్”లో భాగంగా ప్రదర్శించబడతాయి, ఇందులో షారుఖ్ ఖాన్, కాజోల్, అమితాబ్ బచ్చన్ వంటి ఇతర భారతీయ సినీ తారల విగ్రహాలు ఉన్నాయి. ఈ గౌరవం 2024 సెప్టెంబర్ 30న అబుధాబిలో జరిగిన ఐవా ఉత్సవం 2024 సందర్భంగా ప్రకటించబడింది. రామ్ చరణ్‌కు “మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు” కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “మేడమ్ టుస్సాడ్స్ ఫ్యామిలీలో చేరడం గౌరవంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు ఈ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయేవాడిని, ఇప్పుడు నా విగ్రహం ఇక్కడ ఉండటం కలలా ఉంది'' అని చెప్పాడు. ఈ విగ్రహాలు 2025 వేసవిలో సింగపూర్‌లో శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచబడతాయి.

ehatv

ehatv

Next Story