వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram gopal varma) మేనకోడలు(Niece) శ్రావ్య వర్మ(Sravya sharma) మెడలో త్వరలో మూడు ముళ్లు పడనున్నాయి.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram gopal varma) మేనకోడలు(Niece) శ్రావ్య వర్మ(Sravya sharma) మెడలో త్వరలో మూడు ముళ్లు పడనున్నాయి. సినీ నిర్మాత, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌ను(Kidambi sri kanth) పెళ్లి చేసుకోబోతున్నారు. శనివారం ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఈ విషయాన్ని శ్రావ్యనే సోషల్‌ మీడియా వేదిక ద్వారా తెలిపింది. దీనిపై కిదాంబి శ్రీకాంత్‌ కూడా రియాక్టయ్యారు. శ్రావ్య తనకు ఓకే చెప్పిందని, తామిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాయడానికి సిద్ధమవుతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) రాసుకొచ్చారు శ్రీకాంత్‌. అక్కినేని నాగార్జున(akkineni Nagarjuna), స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), పంజా వైష్ణవ్‌ తేజ్‌(Vaishanv tej), విక్రమ్‌ తదితర హీరోలకు శ్రావ్య వర్మ కాస్టూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. శ్రావ్య వర్మ త‌న మేన‌కోడ‌ల‌ంటూ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా వేడుకలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే!




Updated On
Eha Tv

Eha Tv

Next Story