అర్జున్‌రెడ్డి, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

అర్జున్‌రెడ్డి, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ, ఇద్దరూ అధికారికంగా ఏమీ చెప్పలేదు. రష్మిక ఎక్కడ కనిపించినా ఆమె వేలికి ఉంగరం కనిపించింది. ఈ నేపథ్యంలో త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక, విజయ్ ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోవచ్చని తొలుత వార్తలు వచ్చినా కానీ వాలెంటైన్స్ డేకు 12 రోజుల తర్వాత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మిక వివాహం చేసుకోనున్నారు. అంతే కాదు... నిశ్చితార్థం మాదిరిగానే వీరి పెళ్లి కూడా సన్నిహితుల మధ్యలోనే జరుగుతుందని, ఇందులో కుటుంబ సభ్యులు - సన్నిహిత మిత్రులు మాత్రమే పాల్గొంటారని తెలిసింది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని, అందులో కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందినవారు కూడా పాల్గొంటారని తెలిసింది.

Updated On
ehatv

ehatv

Next Story