✕
Rashmika Mandanna Special Day : ఆ రోజు తనకు స్పెషల్ డే అంటున్న రష్మిక మందన్న.. !
By EhatvPublished on 4 April 2023 5:01 AM GMT
రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఈమె టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్. మొన్నీమధ్యే వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసింది. ఆ మూవీకి #VNRTrio పేరుతో షూటింగ్ జరపబోతున్నారు. అదలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన్న (Rashmika Mandanna) మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రేపు రష్మిక 27 ఏటలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది.

x
Rashmika Mandanna
-
- రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఈమె టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్. మొన్నీమధ్యే వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేసింది. ఆ మూవీకి #VNRTrio పేరుతో షూటింగ్ జరపబోతున్నారు. అదలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన్న (Rashmika Mandanna) మరో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే రేపు రష్మిక 27 ఏటలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది.
-
- 1996 ఏప్రిల్ 5న కర్నాటకలోని కొడకు జిల్లా విరజ్పేటలో జన్మించిన రష్మిక ((Rashmika).. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ ప్లేస్ సంపాధించగా.. 2017లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) కిరిక్ పార్టీ (Kirik Party) అనే సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
-
- 2014లో మోడలింగ్ స్టార్ట్ చేసిన రష్మిక (Rashmika)అదే సంవత్సరంలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెస్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుని, క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్‌గాను చేసింది. ఆ తర్వాత కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) సరసన ‘అంజనిపుత్ర’ చిత్రంలో నటించింది.
-
- కన్నడలో రెండు చిత్రాలు చేసిన తర్వాత అంటే 2018లో వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేషనల్ క్రష్. అలా అడుగుపెట్టిన ఈ రష్మిక గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు భీష్మ, పుష్ప వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో నెంబర్ హీరోయిన్గా ఎదిగింది.
-
- రష్మిక (Rashmika) తన 27న పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు రెడీగా ఉన్నామంటున్నారు. నేషనల్ క్రష్ అయిన రష్మికకు ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్తున్నారు. అభిమానులు గ్యాప్ ఇవ్వకుండా ఇంతలా విషెస్ చెప్తుండటంతో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఆ ఆనందాన్ని పట్టలేకపోతోందట.
-
- ప్రస్తుతం ఈ భామ పుష్ప2: ది రూల్ తోపాటు యానిమల్, వీన్ఆర్ట్రియో ప్రాజెక్టులు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో 36 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈమె ఇప్పటి వరకు 569 పోస్టులు చేసింది.

Ehatv
Next Story