✕
Ravi Teja Ravanasura : మాస్ మహరాజ్ నుంచి మరో బ్లాక్ బస్టర్.. రావణాసుర హిట్టే..!
By EhatvPublished on 9 March 2023 1:27 AM GMT
మాస్ మహరాజా నుంచి మరో బ్లాక్ బస్టర్‌గా ‘రావణాసుర’ రాబోతుంది. ఇటీవల కాలంలో బాగా బజ్ క్రియేట్ చేసిన సినిమా అంటే మాస్ మహారాజ మూవీ ‘రావణాసుర’ అనే చెప్పాలి. టీజర్, ట్రైలర్ రిలీజ్ అవగానే ఎక్కడలేని హంగామా వచ్చి పడింది. అంతవరకూ సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా వైలెంట్ తుఫాన్‌లా మారిపోయింది ఈ సినిమా హడావుడి.

x
Ravi Teja
-
- మాస్ మహరాజా నుంచి మరో బ్లాక్ బస్టర్‌గా ‘రావణాసుర’ రాబోతుంది. ఇటీవల కాలంలో బాగా బజ్ క్రియేట్ చేసిన సినిమా అంటే మాస్ మహారాజ మూవీ ‘రావణాసుర’ అనే చెప్పాలి. టీజర్, ట్రైలర్ రిలీజ్ అవగానే ఎక్కడలేని హంగామా వచ్చి పడింది. అంతవరకూ సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా వైలెంట్ తుఫాన్‌లా మారిపోయింది ఈ సినిమా హడావుడి.
-
- దానికి కారణం మాస్ మహరాజ్ తనకి తాను కల్పించుకున్న సంచలనాత్మకమైన ఫాలోయింగ్యే. రీజన్ అక్కర్లేదు... సీజన్ అక్కర్లేదు. కొంతమందికి గేర్ పడిందంటే ఇంక స్పీడుని, రేసుని తట్టుకోవడం కష్టతరమే. అదే మాస్ మహరాజ్ మోడల్. కరోనా పీక్ దశలో ఉన్నప్పుడే ‘క్రాక్’ చిత్రం రిలీజ్ అయి వెలవెలబోతున్న సినిమా పరిశ్రమ కాంతిని కట్టబెట్టింది.
-
- ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన అనంతరం మొన్నమొన్నే రిలీజ్ అయిన ‘ధమాకా’ దుమ్ము లేపింది. అది జస్ట్ హిట్ ఒక్కటి మాత్రమే కాదు. తెలుగు సినిమా పరిశ్రమ గౌరవాన్ని, ప్రశ్నార్ధకమైపోతున్న ధియేటర్ల అస్థిత్వాన్ని నిలబెట్టింది. మాస్ మహరాజా అని టైటిల్ ఎవరు పెట్టాడో గానీ.. ఆ వ్యక్తికి హ్యాట్సాఫ్. మాస్ ఫీవర్ అందరూ క్రియేట్ చెయ్యలేరు. అప్పుడప్పుడు వస్తుంటారు అలా అపురూపంగా వచ్చిన హీరోనే రవితేజ.
-
- విగరుగా, పొగరుతో కనబడే, దమ్మున్నోడిలా రొమ్ము విరుచుకుని కెమెరా ముందు నిలబడగలిగే రవితేజ అనే హీరోకి యుగయుగాలుగా అందరిని భయపెట్టే పాత్రలా ముద్ర పడిన రావణాసురుడి పేరుని పెడితే... అగ్నికి ఆజ్యం పోసినట్టే. పైగా టీజర్లో రవితేజ ‘‘సీతని తీసుకెళ్ళాలంటే సముద్రం దాటితే చాలదు.. నన్ను కూడా దాటి వెళ్ళాలి’’ అనే డైలాగ్‌కు గూస్బంప్స్ రాకమానవు.
-
- భాషే తెలియని పాకిస్తోనోళ్ళే నోరు తిరగక పోయినా రావణాసుర గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్పాలి? నెగెటివ్లోనుంచి పాజిటివ్‌లోకి వస్తాడా... పాజిటివ్లోనుంచి నెగెటివ్‌లోకి వస్తాడా.. ఏమో దర్శకుడు సుధీర్ వర్మకి, రవితేజకి మాత్రమే తెలియాలి. ఎట్నుంచి ఎటు వచ్చినా చిక్కేం లేదు. ఆ ట్రావెల్లో రవితేజ రెచ్చిపోతాడు. ఆడియన్స్ మతి పోగొడతాడు.
-
- ‘ధమాకా’ 100 కోట్లు పైచిలుకు వసూళ్ళు రాబట్టి ఎక్కడో చుక్కల్లోకెళ్లి కూర్చుంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌తో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ గురించి ఇంక కొత్తగా చెప్పనక్కర్లేదు. అదో తిరుగులేని సునామీ కలెక్షన్ల పరంగా గానీ, మెగాస్టార్ ఇమేజ్ పరంగా గానీ ఒక మైలురాయి.
-
- అందుకు రవితేజ ప్రధాన కారణమని స్వయంగా మెగాస్టారే మీడియా ముందు రవితేజని మనసారా అభినందించడం మరొక ఎత్తు. అంటే రవితేజ కత్తికి ఎదురులేదని భారీ విజయాల సాక్షిగా నిరూపణ అయిన నగ్నసత్యం. పైగా మాస్ గుండెల నిండా రవితేజ నిండిపోయిన ట్రెండ్ మరీ డేంజరస్. కొట్టాడంటే మామూలుగా కొట్టడు, తగిలిందంటే మామూలుగా తగలదు. చాలా పకడ్బందీగా తెరకెక్కిన ‘రావణాసుర’ రవితేజ కెరీర్‌కి ఇంకొక కలికితురాయి అవుతుందని పరిశ్రమ వర్గాలు నిర్ధారిస్తున్నాయి.
-
- ఇంక ఫాన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. ‘క్రాక్’, ‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ అండ్ ఇప్పుడు వరుస క్రమంలో ‘రావణాసుర’ దుమ్ము లేపుతుంది. అందరూ ఆశిస్తున్నట్టుగా రావణాసుర విజయవిహారం తప్పని సరి. ఎవరు ఏమనుకున్నా తప్పదు మరి. సో ముందుగానే ‘ఈహా’ ఛానెల్, వెబ్ సైట్ టోటల్ గ్రూప్ మాస్ మహరాజాకి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Ehatv
Next Story