''భర్త మహాశయులకు విజ్ఞప్తి '' ఈ సంక్రాంతి రవితేజదే..!

దర్శకుడు కిషోర్ తిరుమల సంక్రాంతికి కావాల్సిన అన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను సమతుల్యంగా మేళవించి రవితేజకు క్లీన్ హిట్ అందించాడు. సెకండ్ హాఫ్‌లో కథకు ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చేలా కార్తీక దీపం రీమిక్స్ పాట హైలైట్‌గా నిలుస్తుంది. మాస్ ఫైట్స్‌పై ఆధారపడకుండా, క్లీన్ & క్లాస్ టోన్‌లో సినిమాను దర్శకుడు సాఫీగా నడిపించాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్ర లహరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో సంక్రాంతి సమయంలో పలు సినిమాలు విడుదల చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. అదే కాన్ఫిడెంట్ తో ఈ రోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే కామెడీ ఫిల్మ్ అనే టాక్‌ను ఆడియెన్స్ నుండి రాబట్టుకుని సూపర్ హిట్ కొట్టేసింది. గత 6 ఏళ్లుగా హిట్ లేని రవితేజకు ఈ సినిమా అల్టిమేట్ హిట్ అందించింది. రవితేజ వింటేజ్ కామెడీ, సాంగ్స్, డాన్స్ లతో అలరించాడు. అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకు సూపర్బ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా సెకండాఫ్‌కు మంచి స్పందన వస్తోంది. రవితేజ ప్రీవియస్ సినిమాలు ప్రభావంతో స్లో స్టార్ట్ అందుకున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి నైట్ షోస్ నుండి కలెక్షన్స్ గట్టిగా ఉంటాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.


