ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు(Tiger Nageswar Rao) సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai). ఈసినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించబోతోంది.

Renu Desai
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు(Tiger Nageswar Rao) సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai). ఈసినిమాలో హేమలతా లవణం పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్రకు సబంధించిన స్పెషల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఇక పాన్ఇండియా రేంజ్ లో ఈమూవీ ఈనెల 20న రిలీజ్ అవ్వబోతుండగా.. ప్రమోషన్లతో మూవీ టీమ్ బిజీ బిజీగా ఉన్నారు.
నటిగా తను గ్యాప్ తీసుకోవడం కోసం చాలా కారణాలు ఉన్నాయన్నారు రేణు. ఇక ముందు తన వయస్సుకు తగ్గ పాత్రలే చేస్తానంటున్నారు. ఇక ఈమూవీలో హేమలతా లవణం పాత్ర చేయడం పుర్వ జన్మలో చేసిన పుణ్యం అని అంటున్నారు రేణు. ట్రైలర్ చూడగానే.. ఈ పాత్రలో తనను చూసి తన కూతురు ఆద్య(Aadhya) బెస్ట్ కాప్లిమెంట్ ఇచ్చిందని.. తన జీవితంలో తన బిడ్డులు తనను చూసి గర్వించేలా ఉంటానన్నారు. చేసే సినిమాలు కూడా అలానే ఉండేలా చూసుకుంటా అన్నారు. రేణు.
అంతే కాదు తాను ఏదైనా సినిమా చేయాలన్నా.. కథ, అందులో పాత్ర, దర్శకుడు,నిర్మాత.. ఇలా అన్ని కోణాల్లో చూసుకుని సినిమా ఒప్పుకుంటానంటున్నారు రేణు. నా ఈ కట్టుబాట్ల విషయంలో అన్నీ కలిసి వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు అని అన్నారు. ఈ సినిమా అన్ని విధాలుగా తనకు నచ్చిందన్నారు. ఇక హేమలతా లవణం పాత్ర తనకు ఛాలెంజింగ్ గా అనిపించింది అన్నారు రేణు. ఎంతో మంది జీవితాలు బాగుచేసిన ఆమె పాత్ర చేయాలంటే ముందు ఆమెగురించి తెలసుకోవాలి.. అందుకే హేమలత గారి మేనకోడలిని కలిసి తన గురించి పూర్తిగా తెలుకున్నాను అన్నారు.
