నాని నటించిన హిట్-3 సినిమా మే 1 న థియేటర్లలో విడుదలైంది.

నాని నటించిన హిట్-3 సినిమా మే 1 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా HIT ఫ్రాంచైజీలో మూడో భాగం, దీన్ని శైలేష్(Kailesh) కొలను డైరెక్ట్ చేశారు. నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ ( Arjun Sarkar)అనే రూత్‌లెస్ పోలీసుగా కనిపించాడు. శ్రీనిధి శెట్టి(Srinedhi Shetty), రావు రమేష్, బ్రహ్మాజీ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. నాని అర్జున్ సర్కార్ పాత్రలో అదరగొట్టాడని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన పాత్రలు చేసిన నాని(Nani), ఈ సినిమాలో బ్రూటల్, యాక్షన్-ప్యాక్డ్ కాప్‌గా కొత్త రూపం చూపించాడు. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో చూపించిన ఇంటెన్సిటీ అభిమానులకు ఫుల్ థ్రిల్ ఇచ్చాయని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు హై-ఓక్టేన్‌గా ఉన్నాయి. బ్లడ్‌షెడ్, గోర్ లెవెల్స్ తెలుగు సినిమాల్లో రీసెంట్‌గా చూడనంత బ్రూటల్‌గా ఉన్నాయని చెప్తున్నారు. ప్రీ-ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్ స్టంట్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు HIT 4 కోసం హైప్ క్రియేట్ చేసేలా క్లైమాక్స్ సన్నివేశాలున్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ యాక్షన్, ట్విస్ట్‌లతో ఊపందుకుందనిలాస్ట్ 30-45 నిమిషాలు "ప్యూర్ మ్యాడ్‌నెస్" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిక్కీ జే. మేయర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్‌లో బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ, ఇంకా కొన్ని సన్నివేశాల విజువల్ ఇంప్రెస్ చేశాయి. విలన్ ప్రతీక్ బబ్బర్ పాత్రకు బలమైన క్యారెక్టరైజేషన్ లేదని, నాని డామినేషన్ ముందు విలన్ వీక్‌గా కనిపించాడని రివ్యూలు చెబుతున్నాయి. నాని, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ ట్రాక్ కొంత స్పీడ్‌బ్రేకర్‌లా అనిపించిందని, సాంగ్స్ నీరసంగా ఉన్నాయనే టాక్ ఉంది. సినిమా ఓపెనింగ్ బాగుంది, యూఎస్‌లో $800,000 మార్క్ దాటింది. డొమెస్టిక్‌గా తొలి రోజు రూ.20 కోట్ల గ్రాస్ అంచనా వేశారు, ఇది నాని కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్. HIT 3 నాని ఫ్యాన్స్‌కి, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి మంచి ఎంటర్‌టైనర్. నాని కెరీర్‌లో డిఫరెంట్, ఇంటెన్స్ రోల్‌తో ఈ సినిమా గుర్తుండిపోతుంది.
