విన్ పౌలీ అధికారికంగా ప్రెస్ మీట్

ప్రస్తుతం మాలీవుడ్‌లో రచ్చ రచ్చ జరుగుతూ ఉంది. అక్కడ చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నివేదించడానికి అక్కడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హేమ కమిటీ అధ్యయనం చేసి ఇటీవల తన నివేదికను సమర్పించింది. మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. నివిన్ పౌలీపై అధికారికంగా లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. నివిన్ పౌలీ సినిమాలో నటిస్తానని హామీ ఇచ్చి విదేశాల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై నివిన్ పౌలీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. తనపై వచ్చినవి అన్నీ తప్పుడు ఆరోపణలని, కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పాడు


Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story