ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయి. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సంప్రదిస్తూ ఉండగా.. "అతనికి (దర్శన్) సంబంధించిన అభ్యర్థనలతో నా వద్దకు రావద్దు” అని స్పష్టం చేశారు. దర్శన్‌ అరెస్టును అడ్డుకునేందుకు సీనియర్‌ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేతో సహా కొందరు శాసనసభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. “చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని.. దేశంలో చట్టానికి ఎవరూ అతీతం కాదని సీఎం తన మంత్రివర్గ సహచరులకు, ఇతర పార్టీ నాయకులకు చెప్పారు. ఎవరైనా నేరం చేసి, దానికి సంబంధించి తగిన ఆధారాలు ఉంటే, అలాంటి వ్యక్తులు చట్ట ప్రకారం శిక్షించబడతారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో పోలీసులను లేదా ఏ ప్రభుత్వ అధికారిని జోక్యం చేసుకోవద్దని, ప్రభావితం చేయవద్దని సిద్ధరామయ్య నేతలందరికీ సూచించారు." అంటూ మీడియా కథనాలు వచ్చాయి.


Updated On
Eha Tv

Eha Tv

Next Story