గేమ్‌ఛేంజర్‌ సినిమా ట్రయలర్‌ కోసం రాంచరణ్ అభిమాని ఓ బహిరంగ లేఖ రాశాడు.

గేమ్‌ఛేంజర్‌ సినిమా ట్రయలర్‌ కోసం రాంచరణ్ అభిమాని ఓ బహిరంగ లేఖ రాశాడు. సినిమా ట్రయలర్‌ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సినిమాకు ఇంకా 13 రోజుల సమయమే ఉందని.. ఎలాంటి ట్రయలర్‌ అప్డేట్‌ ఇవ్వట్లేదని ఈశ్వర్‌ అనే వ్యక్తి లేఖ రాశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెలాఖరులోగా ట్రయలర్ విడుదల చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. చరణ్‌ అన్న భక్తుడిని అంటూ విన్నవించుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్రయలర్‌ కోసం ప్రాణం తీసుకోవడం ఏంట్రా అని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. రాంచరణ్‌ అన్న ఫ్యాన్‌ ఇలాగే ఉంటారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story