✕
DEv Anand Love Story : రొమాంటిక్ హీరో దేవానంద్ విఫల ప్రేమ కథ
By EhatvPublished on 26 Sep 2023 4:36 AM GMT
ఇవాళ ఎవర్గ్రీన్ హీరో దేవానంద్(Dev anand) శతజయంతి. ఆయనే వెండితెరపై తొలి రొమాంటిక్ హీరో. ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు! ఆయన మనసుపడిన అమ్మాయి కూడా ఉంది! కాకపోతే చాలా ప్రేమకథల్లాగే అది కూడా విషాదంగా ముగిసింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దేవానంద్ చాలా అమాయకంగా ఉండేవారు. నటి, గాయని సురయ్య(Suraiya) ప్రేమలో పడ్డారు. దేవానంద్ సినిమాల్లో ప్రవేశించేనాటికే సురయ్య సూపర్‌స్టార్.
-
- ఇవాళ ఎవర్గ్రీన్ హీరో దేవానంద్ శతజయంతి. ఆయనే వెండితెరపై తొలి రొమాంటిక్ హీరో. ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు! ఆయన మనసుపడిన అమ్మాయి కూడా ఉంది! కాకపోతే చాలా ప్రేమకథల్లాగే అది కూడా విషాదంగా ముగిసింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దేవానంద్ చాలా అమాయకంగా ఉండేవారు. నటి, గాయని సురయ్య ప్రేమలో పడ్డారు. దేవానంద్ సినిమాల్లో ప్రవేశించేనాటికే సురయ్య సూపర్‌స్టార్. హిందీ, ఉర్దూ సినిమా ప్రేక్షకులకు ఆమె కలలరాణి. ఎంతటి సౌందర్యరాశో అంత అద్భతమైన గాయని. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సౌందర్యమూ, సుమధుర గాత్రము సురయ్యకు దక్కాయి.
-
- నాలుగేళ్ల పాటు దేవానంద్, సురయ్య చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి ప్రేమకు సురయ్య అమ్మమ్మ అడ్డుపడింది. మతం ఇద్దరిని విడదీసింది. ఇద్దరి హృదయాలు బద్దలయ్యాయి. దేవానంద్ మనసు చంపుకోగలిగారు కానీ సురయ్య ఆ పని చేయలేకపోయింది.. సురయ్యతో కలిసి దేవానంద్ నటించిన మొదటి సినిమా విద్య. ఇది 1948లో వచ్చింది. సురయ్యను చూసి చూడటంతోనే దేవానంద్ నిలువెత్తు ప్రేమలో కూరుకుపోయారు. ఆమె మోహంలో పడిపోయారు. సురయ్యను అవసరమున్నా లేకున్నా తెగ పొగిడేవారు దేవ్. ఆమెకు తెలుసు. దేవ్ తనను పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నారని.
-
- నెమ్మదిగా సురయ్య కూడా దేవ్‌ను ఇష్టపడటం మొదలుపెట్టారు. సురయ్య ఇష్టాఇష్టాలను దేవానంద్ దన ఇష్టాలుగా చేసుకున్నారు. సురయ్యకు గ్రెగరీ పెక్ అంటే ఇష్టమని తెలుసుకుని తను కూడా అలాగే తయరయ్యేవారు. తర్వాతి కాలంలో బాలీవుడ్ గ్రెగరీ పెక్గా ఖ్యాతినొందారనుకోండి. అది వేరే విషయం. దేవానంద్-సురయ్య మధ్య ప్రేమ కథ మొదలయ్యిందన్న సంగతి చాలాకాలం వరకు ఎవరికీ తెలియదు. 1950లలో ఎందుకోగాని సురయ్య ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. అప్పటికే వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు.నాలుగో సినిమా అఫ్సర్. ఈ సినిమా షూటింగప్పుడే దేవ్-సురయ్య మధ్య ఏదో వుందన్న విషయం పరిశ్రమ గ్రహించేసింది.
-
- బొంబాయి టాబ్లాయిడ్స్ ఇష్టం వచ్చిన రాతలు రాసేశాయి.ఇది సురయ్య ఇంట్లో కూడా తెలిసిపోయింది.సురయ్య మేనమామకు మాత్రం ప్రేమ విషయంలో కాస్త సాఫ్ట్ కార్నరే వుండేది.కానీ అమ్మమ్మే పడనీయలేదు.సురయ్యను నీడలా వెంటాడింది.ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి అంగీకరించలేదావిడ! పాపం సురయ్య తల్లేమో ఎటూ చెప్పలేని అమాయకురాలు.ఆమెకు కూడా సురయ్యను దేవానంద్కిచ్చి పెళ్లి చేయాలని వుండేది! ప్రియురాలిని కలుసుకోడానికి ఇంటికెళ్లినప్పుడల్లా దేవ్‌కు అమ్మమ్మ అడ్డుతగిలేది.ఫోన్ చేసినా ఇదే పరిస్థితి.ఎప్పుడూ ఆ ముసిలావిడే లిఫ్ట్ చేసేది.
-
- ఇలా తరుచుగా ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది కూడా.అయినా దేవ్ ఫోన్ చేస్తూనే వున్నారు... ఓ రోజు దేవ్ అదృష్టం కొద్దీ ముసిలావిడ నిద్రపోతోంది. అప్పుడు సురయ్య తల్లి ఫోన్ ఎత్తింది.తన గోడంతా వెలిబుచ్చుకున్నారు.ఒక్కసారి సురయ్యతో మాట్లాడే అవకాశం కల్పించమని వేడుకున్నాడు. ఆమె సరేనంది.రాత్రి పదకొండున్నరకు వస్తే సురయ్యను కలిపిస్తానంది.దేవ్కెందుకో ఈ మాట నమ్మబుద్దేయలేదు. తారాసింగ్ అనే బొంబాయికి చెందిన పోలీసాఫీసర్ మిత్రుడిని వెంటేసుకుని వెళ్లారు.
-
- దేవానంద్‌కు కల్పనా కార్తీక్ పరిచయం అయ్యారు. తర్వాతి కాలంలో వారు దంపతులయ్యారు. అదలా ఉంచితే నవకేతన్ బ్యానర్‌పై దేవానంద్ 35 సినిమాల వరకు నిర్మించారు. ఇందులో మాగ్జిమమ్ హిట్ సినిమాలే ఉన్నాయి. దేవానంద్ ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు. ఆయన సినిమాలే ఇందుకు నిదర్శనాలు. ఘర్ నంబర్ 44, నౌదో గ్యారా, బొంబాయి కా బాబు, కాలాబజార్, కాలాపానీ, పెయింగ్ గెస్ట్, జ్యువెల్ థీఫ్, సీఐడీ, హమ్‌దోనో, అమీర్ గరీబ్, జానీ మేరా నామ్, హరేరామ హరే కృష్ణ ఇలా ఎన్నో ఎన్నెన్నో.. చెప్పాలంటే ఆయన ప్రతీ సినిమా గురించి చెప్పుకోవాలి. ఇవన్నీ కాదు కానీ దేవానంద్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా గైడ్.
-
- భారంగా ఇద్దరూ అక్కడ్నుంచి నిష్ర్కమించారు.మళ్లీ జీవితంలో కలుసుకోలేదు. తర్వాత కొన్నాళ్ల పాటు దేవానంద్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు.సురయ్య జ్ఞాపకాల నుంచి బయటపడలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. మరోవైపు సురయ్య మాత్రం ఈ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. భగ్న ప్రేమికురాలిగా కుమిలిపోయారు.ఇదే సమయంలో లతా మంగేష్కర్ దూసుకొచ్చింది.సురయ్య వద్దనుకున్నారో లేక సురయ్యను నిర్మాతలు వద్దనుకున్నారో తెలియదు కానీ ఆమె మాత్రం నెమ్మదిగా ఫేడవుట్ అయ్యారు...
-
- సోదరుడు విజయానంద్ దర్శకత్వం వహించారు. 1965లో విడుదలైన ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండియన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. నిర్మాణ సమయంలోనే సినిమాపై నెగటివ్ ప్రచారం జరిగింది. దేవానంద్ ఇలాంటి సినిమా చేయడమేమిటని చాలామంది విమర్శించారు కూడా! సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సినిమా విడుదలయ్యాక ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌తో పాటు అన్ని అవార్డులను గెల్చుకుంది.

Ehatv
Next Story