మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌.. సారీ సాయి దుర్గ తేజ్(Sai durga tej) ప్రేమలో పడ్డాడా?

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌.. సారీ సాయి దుర్గ తేజ్(Sai durga tej) ప్రేమలో పడ్డాడా? ఓ నటితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడా? త్వరలోనే ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడా? ఫిలింనగర్‌లో ఈ ప్రశ్నలే వేసుకుంటున్నారంతా! ఆ హీరోయిన్‌ ఎవరో కాదు మెహరీన్‌(Meharin). వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారట! జవాన్‌ చిత్రంలో వీరిద్దరు జోడిగా నటించారు. అప్పట్నుంచే ప్రేమ మొదలయ్యిందట! మెగా స్టార్‌ చిరంజీవి(Chiranjeevi), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు(Pawan kalyan) బిజీగా ఉన్నారు కాబట్టి పెళ్లి వాయిదా పడిందట! లేకపోతే ఈ పాటికే సాయి దుర్గ తేజ్‌, మెహరిన్‌లు దండలు మార్చుకునేవారట! లాస్టియర్‌ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్(Varun)- లావణ్య త్రిపాఠి(Lawanya Tripati) పెళ్లి జరగడంతో సాయి ధరమ్‌ తేజ్‌- మెహ‌రీన్‌ల పెళ్లిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై సాయిధరమ్‌ తేజ్‌ టీమ్‌ రియాక్టయ్యింది. మెహరీన్‌తో పెళ్లి వార్తలన్నీ పుకార్లేనని, ఏమాత్రం నిజం లేదని చెప్పంది. పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. దాంతో వదంతులకు పుల్‌స్టాప్‌ పడింది. అయితే ఇక్కడో మాట చెప్పుకోవాలి. ప్రేమ వార్తలను, పెళ్లి కబర్లును కొట్టిపారేసిన చాలా మంది ఓ శుభ సమయాన జంటగా కనిపించి షాక్‌ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు అయిన సాయి ధరమ్‌ తేజ్‌ 2014లో పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెరంగ్రేటం చేశాడు. మొద‌టి సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఆక్సిడెంట్ త‌ర్వాత సాయి ధరమ్‌ తేజ్ చేసిన విరూపాక్ష కూడా మంచి వసూళ్లనే సాధించింది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కలిసి న‌టించిన బ్రో సినిమా యావరేజ్‌గా పోయింది. మరోవైపు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మెహరీన్‌. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 సినిమాల‌తో స్థిరపడిపోయింది. గ‌తంలో మెహ‌రీన్‌ మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగాల్సిన వివాహం కొన్ని కార‌ణాల వ‌ల్ల రద్దయ్యిందన్న విషయం తెలిసిందే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story