టాప్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

టాప్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది. ఆ సమాధానాలతో నిజాయితీ ఉంటుంది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’(ask me anything) సెషన్‌లో అభిమానులతో ముచ్చటించింది సమంత. కొన్ని సినిమాల విషయంలో తప్పులు చేశానని చెప్పింది. ఎంపిక సరిగ్గా లేదని ఒప్పుకుంది. అందుకే ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదని చెప్పింది. కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదంది. కథల ఎంపికలో తాను చేసిన తప్పుల వల్ల విజయాలకు దూరమయ్యానని, తన ఫెయిల్యూర్స్‌ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని తెలిపింది. కొన్ని చిత్రాల్లో బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వలేకపోయాననే బాధ కూడా ఉందనీ, అపజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని పేర్కొంది. ఇక నుంచి ప్రతీ సినిమాను ఓ సవాలుగా స్వీకరిస్తానని, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. ఆమె నటించిన హిందీ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’(citadel honey bunny) ఈ నెల 8 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story