ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax media) సినిమా తారలకు(Movie star) సంబంధించి ర్యాంకులు ప్రకటిస్తుంటుంది.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax media) సినిమా తారలకు(Movie star) సంబంధించి ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. క్రికెట్ ప్లేయర్లకు ఐసీసీ ర్యాంకులు ఇచ్చినట్టుగానే హీరో, హీరోయిన్‌ల క్రేజ్‌ ఆధారంగా ప్రతి నెల మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌(Most Popular) పేరిట టాప్‌ టెన్‌ జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ నెలలో పాపులర్‌ హీరో-హీరోయిన్ల లిస్టును ప్రకటించింది. ఇందులో కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌(Vijay thalapathy) మొదటి స్థానంలో నిలిచాడు. సెకండ్‌ ప్లేస్‌లో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ఉన్నాడు. థర్డ్ ప్లేస్‌లో బాలీవుడ్ హీరో షారూక్‌ ఖాన్‌ నిలిచాడు. దళపతి విజయ్‌ ఇటీవల గోట్‌ అనే సినిమాలో నటించాడు. అలాగే రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఈ మధ్యనే పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించారు. హీరోల లిస్టులో నాలుగో స్థానంలో తమిళ హీరో అజిత్‌ కుమార్‌ ఉన్నారు. అయిదో స్థానంలో ఎన్టీఆర్‌, ఆరో స్థానంలో అల్లు అర్జున్‌, ఏడో స్థానంలో మహేశ్‌బాబు, ఎనిమిదో స్థానంలో అక్షయ్‌కుమార్‌, తొమ్మిదో స్థానంలో రామ్‌చరణ్‌, పదో స్థానంలో సల్మాన్‌ఖాన్‌ నిలిచారు. ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే టాప్‌ ప్లేస్‌లో సమంత(Samantha) నిలిచారు. సెకండ్‌ ప్లేస్‌ను అలియా భట్‌(Alia bhat), థర్డ్ ప్లేస్‌ను దీపికా పడుకొణే సంపాదించుకున్నారు. లేడి సూపర్‌స్టార్‌ నయనతార నాలుగో స్థానంలో నిలిస్తే, త్రిష అయిదో ప్లేస్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా శ్రద్ధా కపూర్‌, కాజల్ అగర్వాల్‌, సాయిపల్లవి, రష్మిక, కియారా అద్వాణి ఉన్నారు.

హీరోలు

1.విజయ్‌

2.ప్రభాస్‌

3.షారుక్‌ ఖాన్‌

4.అజిత్ కుమార్‌

5.ఎన్టీఆర్‌

6.అల్లు అర్జున్‌

7.మహేశ్‌బాబు

8.అక్షయ్‌ కుమార్‌

9.రామ్ చరణ్‌

10.సల్మాన్‌ ఖాన్‌

హీరోయిన్లు

1.సమంత

2.అలియా భట్‌

3.దీపికా పదుకొణె

4.నయనతార

5.త్రిష

6.శ్రద్ధాకపూర్‌

7.కాజల్ అగర్వాల్‌

8.సాయిపల్లవి

9.రష్మిక

10.కియారా అడ్వాణి

Updated On
Eha Tv

Eha Tv

Next Story