సిటాడెల్: హనీబన్నీ(Citadel : Honey bunny) వెబ్‌సిరీస్‌లో తాను పోషించిన తల్లి పాత్రపై(Mother character) నటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు

సిటాడెల్: హనీబన్నీ(Citadel : Honey bunny) వెబ్‌సిరీస్‌లో తాను పోషించిన తల్లి పాత్రపై(Mother character) నటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తల్లి కావాలని ఉందని.. ఆ మేరకు తనకు డ్రీమ్‌ ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మగా ఉండేందుకు ఇష్టపడుతున్నానని.. ఇందుకు ఆలస్యమైందుకు బాధగా లేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం తాను ఈ లైఫ్‌లో చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో తన కూతురు పాత్రలో నటించిన కశ్వీ ముజ్మందర్ చాలా తెలివైన అమ్మాయని.. తన హావభావాలతో చాలా చక్కగా నటించిందని ఆమె ప్రశసించారు. కాగా సమంత నటించిన ‘సిటాడెల్‌: హనీ బన్ని’ అమెజాన్‌ ప్రైమ్‌లో(Amazon prime) నవంబర్‌ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అయింది. ఈ సిరీస్‌లో సీక్రెట్ ఏజెంట్‌గాను, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. యాక్షన్ సీన్లలో కష్టపడిన విధానం, అలాగే వరుణ్ ధావన్‌తో(Varun dhawan) కలిసి పండించిన రొమాన్స్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. కూతురు పాత్రలో కశ్వీ ముజ్మందర్‌ నటనకు ప్రశంసలు అందాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story