అందరూ అనుకున్నదే జరిగింది. పుకార్లు నిజమయ్యాయి. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకుంది.

అందరూ అనుకున్నదే జరిగింది. పుకార్లు నిజమయ్యాయి. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె పెళ్లాడింది. ఈరోజు ఉదయం ఈ పెళ్లి జరిగిందని విశ్వసనీయ వర్గం హిందూస్థాన్ టైమ్స్ కు తెలిపింది. వార్తలు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్యామాలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అనే అర్థం వచ్చేలా ఒక పోస్టును. సమంత-రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో, ఇది వారిని ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఆమెతో 2022లో రాజ్ నిడిమోరు విడాకులు తీసుకున్నారు. గతంలో హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి, పెళ్లాడింది సమంత. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్లు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మళ్లీ ప్రేమలో పడింది. అతనితో కొంతకాలంగా డేటింగ్ లో ఉంది. వీళ్లు డిసెంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. చివరకు అదే నిజమైంది. సమంత, రాజ్ ఇవాళ వివాహ బంధంతో ఒకటయ్యారు.


