సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు గురించి సోషల్ మీడియాలో, మీడియా లో చాలా రూమర్స్ తిరుగుతున్నాయి.

సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు గురించి సోషల్ మీడియాలో, మీడియా లో చాలా రూమర్స్ తిరుగుతున్నాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, ఇంకా కొంతమంది అయితే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాల్లో కలిసి దర్శనం చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. సమంత చేతిలో డైమండ్ రింగ్ ఉన్న ఫోటో నెటిజన్లలో నిశ్చితార్థం జరిగిందేమో అనే అనుమానాలు రేకెత్తించింది. ఇటీవల సమంత(Samantha Ruth Prabhu ) తన ఇన్స్టాగ్రామ్ లో "కొత్త ప్రారంభం" అంటూ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో సెల్ఫీలు పోస్ట్ చేసింది. వీళ్లిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్, హనీ బన్నీ' వెబ్ సిరీస్‌లలో కలిసి పనిచేశారు, దీంతో వీళ్ల మధ్య బాండింగ్ పెరిగిందని టాక్. కానీ, ఇదంతా ఒకవైపు అయితే, రాజ్ నిడిమోరు ఇప్పటికే పెళ్లై, శ్యామలీ(Shyamali) అనే భార్య ఉంది. అతను డివోర్స్ ఇచ్చాడని కొంతమంది, ఇంకా మాట్లాడుకుంటున్నారని మరికొంతమంది అంటున్నారు, కానీ దీనిపై స్పష్టత లేదు. ముఖ్యంగా, సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరూ ఈ రూమర్స్ పై బహిరంగంగా స్పందించలేదు, ఖండించలేదు కూడా.

ehatv

ehatv

Next Story