తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై సీనియర్‌ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. లింగ్‌ సినిమా ఎడిటింగ్‌లో రజనీకాంత్‌ వేలు పెట్టారని, అందుకే ఆ సినిమా ఫెయిలయ్యిందని అన్నారు.

తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై సీనియర్‌ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. లింగ్‌ సినిమా ఎడిటింగ్‌లో రజనీకాంత్‌ వేలు పెట్టారని, అందుకే ఆ సినిమా ఫెయిలయ్యిందని అన్నారు. ఎడిటింగ్‌లో రజనీకాంత్‌(Rajinikanth) అనవసరం జోక్యం ఎక్కువయ్యింది. గ్రాఫిక్స్‌కు నాకు అసలు టైమ్‌ ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తం రజనీకాంత్ మార్చేశారు. అనుష్క(Anushka)తో ఉండే ఓ పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను పూర్తిగా తీసేశారు. కథతో సంబంధం లేని బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ యాడ్‌ చేశారు. మొత్తంగా రజనీకాంత్‌ లింగ్‌ను గందరగోళం చేసి పడేశారు' అంటూ రవికుమార్‌(K.S Ravi Kumar) వాపోయారు. రజనీకాంత్‌తో ముత్తు(Muthu), నరసింహ(Narasimha) వంటి సూపర్‌ డూపర్ హిట్స్‌ను అందించిన రవికుమార్‌ లింగ(Linga) సినిమాలో ఆ మార్క్‌ చూపించలేకపోయారు. 2014లో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్‌ది డబుల్‌ రోల్‌. భారీ బడ్జెట్‌లో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్కతో పాటు సోనాక్షిసిన్హా(Sonakshi Sinha) కూడా హీరోయిన్‌గా నటించింది. మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం అందుకుంది. సినిమాల్లో వేలు పెట్టే అలవాటు రజనీకాంత్‌కు కూడా ఉందన్నమాట!

Updated On
ehatv

ehatv

Next Story