చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయికుమార్ తనయుడు ఆది తన జానర్ మార్చుకుని పీరియాడికల్ మిస్టరీ త్రిల్లర్ తో శంభాల రూపంలో మన ముందుకు వచ్చాడు.

చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయికుమార్(Sai kumar) తనయుడు ఆది తన జానర్ మార్చుకుని పీరియాడికల్ మిస్టరీ త్రిల్లర్ తో శంభాల(Shambhala) రూపంలో మన ముందుకు వచ్చాడు. ఆది గత తాలూకు చిత్రాలు గమనిస్తే, వాటితో పోలిస్తే ఈ చిత్రం చాలా ఉపశమనాన్ని ఇచ్చిందనే నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి చూస్తే జనాలు కూడా పీరియాడికల్, మైథిలాజికల్ సినిమాలను విపరీతంగా ఇష్టపడుతున్నారు. బహుశా దర్శకుడు యుగంధర్ ముని(Yugendar Muni) ఈ కారణంతోనే చాలా బరువైన కథను ఎంచుకున్నాడు అనిపించింది. ఎంచుకోవటమేంటి సరైన న్యాయం చేశాడు కూడా.. దేవుడు, దెయ్యం, పురాణాలు, సైన్స్ ఈ అంశాలన్నింటినీ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా జనాలకు అర్థమయ్యేలా చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు యుగంధర్ ముని. అక్కడే సినిమా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఈ బరువైన కథ చెప్పే క్రమంలో కొంచెం సాగతీత కూడా ఎక్కువైందనిపించింది అక్కడక్కడ. అయితే సినిమా స్లో అవుతుంది అనుకున్నప్పుడల్లా మంచి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో మనల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఈ విషయంలో మనం అతన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి. సెకండ్ హాఫ్ అంతా కూడా పవర్ ఫుల్, ఎమోషనల్ సన్నివేశాలతో నింపి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వరకు కూడా బాగానే లాక్కొచ్చాడు. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ కొంచెం కన్విన్సింగ్ గా లేదనిపించింది. శంబాల' సినిమాలో కాస్త 'విరూపాక్ష'(Virupaksha) ఛాయలు కనిపిస్తాయి. అలాగని రెండిటి మధ్య పోలికలు లేవు. కానీ, మరణాలు సంభవించే అంశంలో సారూప్యత ఉంది. బడ్జెట్ లిమిటేషన్ వల్ల వీఎఫ్ఎక్స్(VFX), ఒకరిద్దరు ఆర్టిస్టుల ఎంపికలో క్వాలిటీ లోపించింది. అయితే వ్యూయర్ ఎక్స్‌పీరియన్స్‌ను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు.
ఇక నటీనటుల విషయానికొస్తే శంబాల'కు తెరపై హీరో ఆది(Hero Adhi) సాయికుమార్ గెటప్, నటనలో పరిణితి కనబడింది. క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆది నటించారు.అర్చనా అయ్యర్(Archana iyer) హీరోయిన్ అని చెప్పలేం. కథలో ఆమెది కీలకమైన పాత్ర. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు నమ్మేలా అర్చన లుక్, గెటప్ ఉన్నాయి.ఆదిని వెన్నంటి ఉండే పాత్రలో మధునందన్ చక్కగా నటించారు. మరో టీవీ సీరియల్ నటుడు ఇంద్రనీల్ సీన్స్ సర్‌ప్రైజ్ చేస్తాయి. ఆయన కటౌట్ వల్ల ఆ సీన్స్ చూసినప్పుడు నమ్మేస్తాం. రవివర్మ నటన 'వావ్' అనేలా ఉంది. ఆయన విజృంభించారు. పల్లెటూరి మహిళ పాత్రలో శ్వాసిక విజయ్ చేత గ్లామర్ షో చేయించారు. లక్ష్మణ్ మరోసారి మంగళవారం తరహాలో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల వరకూ చూస్తే శ్రీచరణ్ పాకాల (Sri charan pakala)నేపథ్య సంగీతంతోనే భయపెట్టాడు. ప్రవీణ్ కె.బంగారి (Praveen K bangari)కెమెరా పనితనంతో శంబాలకు మెరుగులు దిద్దాడు. దర్శకుడు యుగంధర్ ఇలాంటి ఓ బరువైన కథకు రచనా పరంగా ఇంకొంత సమయం తీసుకుని వుంటే సన్నివేశాల్లో ఆ ఇంపాక్ట్ కనిపించేది. మేకింగ్ పరంగా మాత్రం ఆయన ప్రతిభ తెలుస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి సాయికుమార్ గారి అబ్బాయి ఆది సాయికుమార్ పరాజయాల బాట నుండి విజయాల బాట వైపు శంబాల నడిపించింది అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


