హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ నటనా పటిమ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమెకు రాని విద్య లేదు. నటనే కాదు, పాటలు కూడా పాడగలరు.


టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. లేటెస్ట్‌గా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు.


నలుపు డ్రస్‌లో శ్రుతిహాసన్‌ కొత్తగా కనిపిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో చేసిన ఫోటో షూట్‌లా అనిపించడం లేదు. శ్రుతి హాసన్‌ను ఈ మ్యాగజైన్ “ప్రకృతి శక్తి”గా అభివర్ణించింది.


ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో పాటు శ్రుతి హాసన్‌ తన సినీ కెరీర్‌ మీద కూడా ఫోకస్‌ పెట్టారు.


ప్రస్తుతం ఆమె స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి “కూలీ” చిత్రంతో నటిస్తున్నారు.


కమలహాసన్‌-సారిక కూతురుగా శ్రుతి హాసన్‌కు నటన వారసత్వంగా వచ్చింది.


ఆమె సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో అవగాహన పెంచుకున్నారు.


శ్రుతి హాసన్ తెరపైనే కాకుండా, సంగీత ప్రదర్శనలతోనూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.


సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తుంటారు.




Updated On
Eha Tv

Eha Tv

Next Story