సినిమా అభిమానులు ఎంతో కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న మూవీ ఇండియన్‌ 2(Indian 2).

సినిమా అభిమానులు ఎంతో కాలంగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న మూవీ ఇండియన్‌ 2(Indian 2). లోకనాయకుడు కమలహాసన్‌(Kamal haasan) భారతీయుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌(Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇండియన్‌(Indian) సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలుసు. భారతీయుడు 2 సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. అలాగే ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రమోషనల్‌ ఈవెంట్‌(Promotional event) ఊడా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఇండియన్ 2 (భారతీయుడు 2) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకు లాంగ్‌ రన్‌ టైమ్‌ పిక్స్‌ చేశాడు దర్శకుడు శంకర్‌. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఇండియన్‌ 2 సినిమా నిడివి(Movie duration) 180 నిమిషాలు. అంటే మూడు గంటలు. నిజానికి సినిమా ఎప్పడో రావాల్సింది. అనేక కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇంత ఆలస్యంగా వస్తున్న ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువైనా ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టదని మేకర్స్‌ చెబుతున్నారు. లాస్ట్‌ వీక్‌ ప్రభాస్‌ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా నిడివి కూడా మూడు గంటల పాటు ఉంది. ప్రభాస్‌ స్టార్‌డమ్, గ్రాఫిక్‌ ఎలిమెంట్స్‌, స్టార్‌ యాక్టర్ల గెస్ట్‌ అప్పీరియన్స్‌ ఇవన్నీ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టి చూసేలా చేశాయి. ఇండియన్‌ 2ను కూడా ప్రేక్షకులు అలాగే చూస్తారని చెబుతున్నారు. ఇండియన్‌ 2లో ఎస్‌జే సూర్య(SJ Surya), బాబీ సింహా(Bobby simha), సిద్దార్థ్‌(Siddharth), స‌ముద్రఖని(Samuthrakhani), లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం(Bramhanandam), మధుబాల(madhubhala), ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh), ప్రియా భ‌వానీ శంక‌ర్‌(Priya Bhavani shankar) నటిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story