తెలంగాణలో(Telangana) రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో(Theaters) సినిమాలు నడవవు. పక్షం రోజుల పాటు సినిమా(Movies) ప్రదర్శనలను నిలిపి వేస్తున్నామని థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి.

No movies In Telangana
తెలంగాణలో(Telangana) రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో(Theaters) సినిమాలు నడవవు. పక్షం రోజుల పాటు సినిమా(Movies) ప్రదర్శనలను నిలిపి వేస్తున్నామని థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువగా వస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. సినిమాల ప్రదర్శనలు ఆపడం తప్ప తమకు మరో దారి లేదంటున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా స్వచ్ఛంగా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలను నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ప్రదర్శనలు కొనసాగిస్తామని చెప్పారు.
