అతి త్వరలో బిగ్‌బాస్‌(Telugu Bigg boss) తెలుగు సీజన్‌ -8 ప్రారంభం కానుంది.

అతి త్వరలో బిగ్‌బాస్‌(Telugu Bigg boss) తెలుగు సీజన్‌ -8 ప్రారంభం కానుంది. ఇక టెలివిజన్‌ ప్రేక్షకులకు పండగే పండుగ! ఈ రియాలిటీ షో (Reality Show)బ్రహ్మండంగా సక్సెస్‌ అయ్యింది. ఒకట్రెండ్‌ సీజన్‌లు డల్‌గా సాగినా ఓవరాల్‌గా ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను ఆదరించారు. ఎనిమిదో సీజన్‌లో హౌస్‌లోకి వచ్చేదెవరు అన్నదే క్యూరియాసిటీగా మారింది. దీనిపైనే సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ షో కోసమే అన్నపూర్ణ స్టూడియోలో(Anapurna sets) సెట్‌ కూడా రెడీ అవుతోంది. ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇటీవలే ప్రోమోను(Promo) కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే టైటిల్ లోగోనూ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌-8లో ఎవరెవరు పోటీ పడుతున్నారన్నదానిపై సోషల్‌ మీడియాలో అయితే బోల్డన్ని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.

బర్రెలక్క(Barrelakka) (శిరీష), అబ్బాస్(abbas), రాజ్ తరుణ్(Raj Tharun), కుమారి ఆంటీ(Kumari aunty), యాదమ్మ రాజు(Yadamma Raj), రీతూ చౌదరి(Rithu Choudhary), విష్ణుప్రియ(Vishnu priya), బుల్లెట్ భాస్కర్(Bullet bhaskar), టాలీవుడ్ సీనియర్ నటి సనా(Sana), రోహిత్(Rohit) తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా వీరిలో ఇద్దరి పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా దాదాపుగా కన్ఫామ్ అయిపోందని సమాచారం. వారే స్టార్ యాంకర్స్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి. అన్నట్టు సోషల్ మీడియాలో బాగా పాపులర్‌ అయిన బాంకాక్‌ పిల్ల(Bankok girl) కూడా బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోతున్నారట! కమెడియన్‌ అలీ తమ్ముడు ఖయ్యుమ్‌(Khayum) పేరు కూడా వినిపిస్తోంది. కొన్ని సినిమాల్లో కూడా నటించిన ఖయ్యుమ్‌ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. షోకు టీఆర్పీ రేటింగ్స్‌ కూడా కావాలి కదా! ఇందుకోసం స్వాతి నాయుడును(Swathi Naidu) కూడా హౌస్‌లోకి తెస్తున్నారట! కెరీర్ బిగినింగ్ లో శృంగార సమస్యలపై వచ్చే టివి షోలకు యాంకర్‌గా చేసిన స్వాతి నాయుడు ఆ తర్వాత శృంగారభరిత సినిమాల్లో కూడా నటించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story