మలయాళం స్టార్‌ హీరో మమ్ముట్టి(Mamootty) కుమారుడు దుల్కర్‌లా(Dulqar salmaan) మోహన్‌లాల్(Mohan lal) కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌(Pranav lal) షైన్‌ అవ్వలేదు.

మలయాళం స్టార్‌ హీరో మమ్ముట్టి(Mamootty) కుమారుడు దుల్కర్‌లా(Dulqar salmaan) మోహన్‌లాల్(Mohan lal) కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌(Pranav lal) షైన్‌ అవ్వలేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రణవ్‌ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలకు పని చేశాడు. తర్వాత హీరో అయ్యాడు. ఆది సినిమాతో హీరో అయ్యాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఏ ఒక్కటి ప్రణవ్‌కు ప్లస్‌ అవ్వలేదు. హృదయం సినిమా మాత్రం హిట్టయ్యింది. ఇటీవలవర్షంగళకుశేషం అనే సినిమా చేశాడు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన చాలా సినిమాలకు నటుడు శ్రీనివాసన్‌ కథ-స్క్రీన్‌ప్లేలను అందించారు. అలాగే మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌తో శ్రీనివాసన్‌ కుమారుడు వినీత్‌ శ్రీనివాస్‌ రెండు సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం కూడా వహించాడు. హృదయం, వర్షంగళకుశేషం తీసింది వినీత్‌ శ్రీనివాసనే! ప్రస్తుతం ప్రణవ్‌ కొంత గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో స్పెయిన్‌కు(spain) వెళ్లాడు. ఎంజాయ్‌ చేయడానికి కాదు. అక్కడో ఫామ్‌లో(Farm) పని చేయడానికి! అది కూడా ఓ రకమైన కూలీపని. గొర్రెలు కాయ‌డం, గుర్రాల‌ను చూసుకోవ‌డం వంటి ప‌నులు కూడా చేస్తున్నాడు. ఇందుకోసం అతడేమీ జీతం తీసుకోవడం లేదు. కేవ‌లం భోజ‌నం(Food) పెట్టి, ఆ ఫామ్ లోనే షెల్ట‌ర్(Shelter) ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రణవ్‌ తల్లి చెప్పారు.

ప్ర‌ణ‌వ్ అలా కూలి ప‌నిలాంటి ప‌ని చేసుకుంటున్నాడ‌ని, అది అత‌డి ఇష్ట‌మ‌ని ఆమె తెలిపారు. తనకైతే ప్రణవ్‌ వీలైనన్ని సినిమాలు చేయాలని ఉందని అన్నారు. విరామం తీసుకుని ఇలా స్పెయిన్ లో అత‌డు వ్య‌వ‌సాయ కూలీ త‌ర‌హాలో ప‌ని చేస్తున్నాడ‌ని, ఈ ప‌నులను అత‌డు ఆస్వాదిస్తున్నాడ‌ని ఆమె చెప్పారు!

Updated On
Eha Tv

Eha Tv

Next Story