విజయవంతమైన ఈ చిత్రం నవంబర్ 7, 2024 నుంచి ఓటీటీలోకి(OTT) రానుంది

సూపర్‌స్టార్లు రజనీకాంత్(Rajinikanth), అమితాబ్ బచ్చన్(Amitabh bacchan) నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, 'వెట్టయన్'(Vettayan), అక్టోబర్ 10 న విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయవంతమైన ఈ చిత్రం నవంబర్ 7, 2024 నుంచి ఓటీటీలోకి(OTT) రానుంది. TJ జ్ఞానవేల్(TJ gnanavel) దర్శకత్వం వహించిన 'వెట్టయన్' భారతదేశంలో రూ. 141.5 కోట్లకు పైగా వసూలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌ల 'వెట్టయన్' ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అక్టోబర్ 10, 2024న థియేటర్‌లలో విడుదలైనప్పటి నుంచి మంచి వసూళ్లు సాధిస్తోంది. చెన్నైలో వరదల కారణంగా అనుకున్న కలెక్షన్లు రాబట్టలేదు. దీంతో ఓటీటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి వేడుకల తర్వాత నవంబర్ 7, 2024 నుండి అమెజాన్ ప్రైమ్(Amazon prime video) వీడియోలో ప్రసారం చేయడానికి 'వెట్టయన్' అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైం 90 కోట్ల రూపాయలకు డిజిటల్ హక్కులను పొందారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'వెట్టయన్' థియేట్రికల్ రన్‌లో 15 రోజుల్లోనే భారతదేశంలో రూ.141.5 కోట్లకు పైగా వసూలు చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story