ఎక్స్‌ వేదికగా మహేష్‌బాబు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

అక్కినేని కుటుంబం(Akkineni family), సమంతపై(Samantha) నిన్న మీడియా ఎదుట బహిరంగ విమర్శలు చేసిన కొండా సురేఖపై(Konda surekha) ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు(Mahesh babu) స్పందించారు. ఎక్స్‌ వేదికగా మహేష్‌బాబు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. 'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నా. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలి' అంటూ మహేష్‌బాబు ట్వీట్ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story