తెలంగాణ ప్రభుత్వం 2024కి సంబంధించిన అవార్డులను జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం 2024కి సంబంధించిన అవార్డులను జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ప్రకటించారు. మొత్తం 1248 నామినేషన్లను పరిశీలించి, 21 విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు.

ఉత్తమ చిత్రం (మొదటి): కల్కి

ఉత్తమ చిత్రం (రెండవ): పొట్టేల్

ఉత్తమ చిత్రం (మూడవ): లక్కీ భాస్కర్

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)

ఉత్తమ పరిచయ దర్శకుడు: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2 - సూసేకి అగ్గిరవ్వ)

ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)

ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజూ యాదవ్)

ఉత్తమ సినిమాటోగ్రఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)

ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)

ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)

2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలకు కూడా ఒక్కో ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇవ్వనున్నారు. పైడి జయరాజ్, కాంతారావు, ఎం. ప్రభాకర్ రెడ్డి పేరిట ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ఈ అవార్డులు తెలుగు సినిమాతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాయి. ఏప్రిల్‌లో ప్రదానోత్సవం జరుగుతుందని ప్రకటించారు

ehatv

ehatv

Next Story