ఇక్కడ ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు... బిగ్‌బాస్‌ ప్రోమో అదరహో!

రియాలిటీ షో బిగ్‌బాస్‌(Bigg Boss)(Reality show) కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సీజన్‌08కు సంబంధించిన ప్రోమోను(Promo) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కొన్ని సీజన్ల నుంచి గెస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జుననే(akkineni nargarjuna) ఈసారి కూడా వ్యాఖ్యాతగా ఉండబోతున్నారు. కమెడియన్‌ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు విడుదల చేసిన ప్రోమో కూడా అదిరిపోయింది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అన్న డైలాగ్‌తో బిగ్‌బాస్ సీజన్‌ 8 ప్రోమో మొదలయ్యింది. నాకన్నీ అన్ లిమిటెడ్‌గా కావాలి అంటూ సత్య అలరించాడు. సీజన్‌ 8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్ధంకండి అని చెబుతూ సీజన్‌ 8పై క్యూరియాసిటీని పెంచారు. అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎవరెవరు పార్టిసిపేట్‌ చేస్తున్నారు? అన్న విషయాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story