కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్(Rajkumar) మనవడు యువ రాజ్‌కుమార్(Yuva Rajkumar) తన భార్య శ్రీదేవి భైరప్పతో(Sridevi Bhairappa) తెగతెంపులకు(Dirvorce) సిద్ధమయ్యాడు. ఈ నెల 6వ తేదీన ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. విడాకులెందుకూ అంటే శ్రీదేవి తనను క్రూరంగా హింసపెడుతున్నదని సమాధానం చెప్పాడు యువ రాజ్‌కుమార్. మరోవైపు యువ రాజ్‌కుమార్ చెబుతున్నదంతా అబద్ధాలని, అతడే తనను బాగా హింసిస్తున్నాడని తెలిపింది. యువరాజ్‌కుమార్‌కు వివాహేతర(Extra marital affair) సంబంధం ఉందని శ్రీదేవి చెప్పుకొచ్చింది.

Yuva Rajkumar-Sridevi
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్(Rajkumar) మనవడు యువ రాజ్‌కుమార్(Yuva Rajkumar) తన భార్య శ్రీదేవి భైరప్పతో(Sridevi Bhairappa) తెగతెంపులకు(Dirvorce) సిద్ధమయ్యాడు. ఈ నెల 6వ తేదీన ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. విడాకులెందుకూ అంటే శ్రీదేవి తనను క్రూరంగా హింసపెడుతున్నదని సమాధానం చెప్పాడు యువ రాజ్‌కుమార్. మరోవైపు యువ రాజ్‌కుమార్ చెబుతున్నదంతా అబద్ధాలని, అతడే తనను బాగా హింసిస్తున్నాడని తెలిపింది. యువరాజ్‌కుమార్‌కు వివాహేతర(Extra marital affair) సంబంధం ఉందని శ్రీదేవి చెప్పుకొచ్చింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్‌కుమార్ తరఫు లాయర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అందుకు కౌంటర్‌గా శ్రీదేవి కూడా ప్రత్యారోపణలు చేసింది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అంటూ సోషల్ మీడియాలో(Social media) పోస్టులు పెట్టింది. శ్రీదేవికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటుందని న్యాయవాది అన్నాడు. ఇంటిపేరుకు మచ్చ తెస్తున్నదని ఆరోపించాడు. ఓ వివాహిత వ్యక్తితో శ్రీదేవి సంబంధం పెట్టుకున్నదని, తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఓ నటితో యువ రాజ్‌కుమార్‌కు సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని న్యాయవాది వివరించాడు. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్య ఉందని తన లీగల్ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చిందని, లైంగిక సమస్య ఉంటే వివాహేతర సంబంధం ఎలా సాధ్యమవుతుందని న్యాయవాది ప్రశ్నించాడు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా ఉన్నవి లేనివి కల్పించి చెబుతున్నారని శ్రీదేవి మండిపడింది. ఓ మహిళ పాత్రపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. గత కొన్ని నెలలుగా తాను ఎన్నో బాధలు పడ్డానని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నానని అన్నారు. తన నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరమని, యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని తాను నమ్ముతున్నానని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రాజ్‌కుమార్ రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకే యువ రాజ్‌కుమార్. ఇతడు ఓమ్ సినిమాలో బాల నటుడిగా నటించాడు. ఈ ఏడాది యువ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అందరిని ఒప్పించి పెళ్లి చేశాడు.
